అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట.. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ షాకింగ్ డెసిషన్?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఒకే విషయం గురించి చర్చ జరుగుతుంది. అదే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం గురించి.. ఈ నెల 22వ తేదీన అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించబోతున్నారు. ఏకంగా రామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మహత్తర కార్యం కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయోధ్యలో అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులకు ఎంతో మందికి ఆహ్వానం అందింది అన్న విషయం తెలిసిందే.

 అతిరథ మహారధుల మధ్య ఆ శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగేందుకు సిద్ధమవుతుంది. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఫుల్ సెక్యూరిటీ కూడా ఇప్పటికే ఆయోధ్యలో అడుగు పెట్టింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఇక రాముడిపై ఉన్న భక్తిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఏకంగా ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈనెల 22వ తేదీన ఉండడంతో కర్ణాటకలోని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వినూత్న రీతిలో రాముడిపై భక్తిని చాటుకుంది. ఏకంగా ఐదు రోజుల పాటు ఉచితంగా ప్రస్తావాలు చేయాలని నిర్ణయించింది సదరు ఆసుపత్రి యాజమాన్యం.

 కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని సిద్దేశ్వర లోక కళ్యాణ్ ట్రస్ట్ ఇలాంటి సంచలన ప్రకటన చేసింది. ఏకంగా ఏకంగా ఈనెల 18వ తారీకు నుంచి 22వ తేదీ వరకు కూడా తమ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉచితంగా ప్రసవాలు చేయబోతున్నట్లు ప్రకటించింది సదరు ట్రస్ట్. అబ్బాయి పుడితే రామ అవతారం అని.. అమ్మాయి పుడితే సీత రూపంగా తాము భావిస్తాము అంటూ తెలిపింది. కాగా ట్రస్టు నిర్ణయం పట్ల రామ భక్తులందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సదరు ఆసుపత్రి నిజమైన రామ భక్తిని చాటుకుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: