పందెంలో ఓడిన కోళ్లకి కూడా.. ఇంత డిమాండ్ ఉంటుందా?

praveen
తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకునే పెద్ద పండుగలలో సంక్రాంతి కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు భోగి మంటలు రంగురంగుల రంగవల్లులు, సాంప్రదాయ వస్త్రధారణలో యువతీ యువకులు కనిపిస్తూ ఉంటారు. ఇక ఊరు వాడ ఒకే చోట చేరి సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా గాలిపటాలను ఎగరవేస్తూ సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే సంక్రాంతి పండుగ అంటే గుర్తుకు వచ్చేది ఇది మాత్రమే కాదు ఇక చాలామందికి కోళ్ల పందాలు గుర్తుకు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఇలాంటి కోళ్ల పందాలు ఎక్కడ కనిపించవు. కానీ ఆంధ్రాలో మాత్రం కోళ్ల పందాలు లేకుండా సంక్రాంతి పండుగను అసలు ఊహించుకోలేరు. అయితే అటు ప్రభుత్వం కోర్టులు పోలీసులు కోళ్ల పందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఎన్నిసార్లు హెచ్చరించినా.. ఇక ఇలా కోళ్ల పందాల పోటీలు మాత్రం ప్రతి ఏటా జరుగుతూనే వస్తూ ఉన్నాయి. బడబడ రాజకీయ నేతలు  కూడా ఈ కోళ్ల పందాలలో పాల్గొంటూ ఉండడంతో.. పోలీసులు కూడా చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తూ ఉంటారు.

 ఈ కోళ్ల పందాలల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పాలి. అయితే కోళ్ల పందాల గురించి కాస్త తక్కువ తెలిసిన వారికి ఈ విషయంపై ఎన్నో అనుమానాలు ఉంటాయి. కోళ్ల పందాలలో ఓడిన పుంజులను ఏం చేస్తారు అన్న అనుమానం కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. అయితే కోళ్ల పందాలలో ఓడిపోయిన పుంజులను వేలం వేస్తారు. వాటిని దక్కించుకునేందుకు చాలా పోటీ ఉంటుంది. ఎందుకంటే పందెం కోళ్లను బాదాం జీడిపప్పు లాంటి బల వర్ధకమైన ఆహారం అందిస్తూ పెంచుతారు. అందుకే ఏకంగా వేల రూపాయలు ఖర్చు చేసి మరి వేలంలో ఇక ఈ పుంజులను కొనుగోలు చేయడానికి అందరూ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఇలా పందెం కోళ్ల మాంసం ఎంతో రుచిగా ఉంటుందని అందరూ నమ్ముతూ ఉంటారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: