అమరావతి : బీఆర్ఎస్ కు షాక్...కాంగ్రెస్ హ్యాపీ
కేంద్ర ఎన్నికల కమీషన్ తీసుకున్న తాజా నిర్ణయం బీఆర్ఎస్ కు షాకివ్వగా కాంగ్రెస్ మాత్రం హ్యపీగా ఫీలవుతోంది. దీనికి కారణం ఏమిటంటే కమీషన్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ కు అనుకూలంగామారటమే. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణాలో ఖాళీ అయిన రెండు ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరపాలని నోటిపికేషన్ జారీచేసింది. మామూలుగా అయితే రెండు స్ధానాలను ఒకటిగా కలిపే ఎన్నికలు నిర్వహిస్తారని అనుకున్నారు. అదే జరిగితే రెండు పార్టీలకు ఇబ్బందులు ఎదురయ్యేవే.
ఎలాగంటే ఒక ఎంఎల్సీని ఎన్నుకోవాలంటే 40 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి. అంటే రెండు ఎంఎల్సీలను గెలుచుకోవాలంటే ఏ పార్టీకైనా 80 మంది ఎంఎల్ఏల మద్దతు అవసరం. కాంగ్రెస్ కు ఉన్నది 64 మంది ఎంఎల్ఏలు, బీఆర్ఎస్ కు ఉన్నది 39 మాత్రమే. కాంగ్రెస్ ఈజీగా ఒక సీటు గెలుచుకోగలిగితే, బీఆర్ఎస్ ఒక్క సీటు గెలుచుకోవాలంటే చాలా కష్టపడాల్సుంటంది. ఇదే సమయంలో కాంగ్రెస్ రెండో అభ్యర్ధిని కూడా పోటీ పెడితే బీఆర్ఎస్ ఓట్లను చీల్చుకోవాల్సిందే తప్ప వేరే దారిలేదు.
ఈ నేపధ్యంలో అదనపు ఓట్లు ఎలా తెచ్చుకోవాలా ? అని కాంగ్రెస్ ఆలోచిస్తుంటే ఉన్న ఓట్లను కాపాడుకుని ఒక్క సీటును ఎలా గెలుచుకోవాలా అని బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది. సరిగ్గా ఈ సమయంలోనే కమీషన్ జారీచేసిన నోటిఫికేషన్ తో బీఆర్ఎస్ షాక్ తిన్నది. ఎలాగంటే భర్తీ చేయబోయే రెండుస్ధానాలకు ఎన్నికల కమీషన్ వేర్వురుగా నోటిపికేసన్లు ఇచ్చింది. అంటే రెండుస్ధానాలకు వేర్వురుగానే ఎంఎల్ఏలు ఓట్లేయాల్సుంటుంది. ఈ వ్యవహారం చూసిన తర్వాత ఎన్నికల్లో పోటీచేస్తే కష్టమని వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది.
ఈ పద్దతిలో అయితే రెండు స్ధానాలను రాజమార్గంలో కాంగ్రెస్సే గెలుచుకుంటుందనటంలో సందేహంలేదు. నిన్నటివరకు రెండోస్ధానాన్ని ఎలా గెలుచుకోవాలా అని టెన్షన్ పడిన కాంగ్రెస్ ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుంది. కమీషన్ నిర్ణయంతో ఇద్దరు ఎంఎల్సీ అభ్యర్ధులకు కాంగ్రెస్ 40 మంది ఎంఎల్ఏలను కేటాయించి గెలిపించుకోవటం ఖాయం. ఇదే సమయంలో రెండింటిలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు. కాకపోతే కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరగకుండా జాగ్గత్తలు తీసుకుంటే సరిపోతుంది.