రాయలసీమ : భ్రమల్లో నుండి ఇంకా బయటపడలేదా ?
తాను భ్రమల్లో ఉంటు ఎదుటి వాళ్ళని భ్రమల్లో ముంచేయటంలో చంద్రబాబునాయుడుకు మించిన వాళ్ళు లేరు. అయితే ఈ భ్రమలను 53 రోజుల జైలు జీవితం మార్చేసుంటుందని తమ్ముళ్ళు అనుకున్నారు. తన మీద ఎవరు కేసులు పెట్టలేరని, తనను ఎవరు అరెస్టుచేయలేరనే భ్రమల్లో ఉండేవారు. అలాంటిది కేసు నమోదు చేయటమే కాకుండా అరెస్టుచేసి 53 రోజులు రాజమండ్రి జైలులో రిమాండులో కూడా ఉన్నారు. జైలుకు వెళ్ళిన తర్వాతైనా చంద్రబాబు వాస్తవ పరిస్ధితుల్లోకి దిగొస్తారని అనుకున్న వాళ్ళకి నిరాస తప్పలేదు.
దీనికి ఉదాహరణ ఏమిటంటే కుప్పం నేతలతో తాజాగా నిర్వహించిన సమీక్షలో మాట్లాడిన మాటలే. కుప్పం నేతలతో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటితో గెలవాలని ఆదేశించారు. అందుకు వీలుగా అందరు కష్టపడాలని చెప్పారు. పార్టీకోసం కష్టపడిన నేతలు ఎవరినీ తాను మరచిపోనని, అందరినీ గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. ఇలాంటి సొల్లు కబుర్లు దాదాపు 35 ఏళ్ళుగా చంద్రబాబు చెబుతునే ఉన్నారు. కుప్పంలోని నేతలు, క్యాడర్ చాలావరకు మోరేల్ కోల్పోయున్నారు.
అవసరానికి వాడుకోవటం తీరిపోగానే అవతలపారేయటం అన్నది చంద్రబాబు నైజమని అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్నపుడు నేతల్లో చాలామందిని దగ్గరకు కూడా రానీయలేదు. అసలు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో గెలుస్తారా అనే సందేహం కూడా పెరిగిపోతోంది. కుప్పంలో చంద్రబాబును ఎట్టి పరిస్ధితుల్లోను గెలవనీయకూడదని జగన్మోహన్ రెడ్డి పంతంపట్టి కూర్చున్నారు. చంద్రబాబు ఓడించాలన్న పట్టుదలతో నియోజకవర్గంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఆమధ్య జరిగిన లోకల్ బాడీ ఎన్నికలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది.
అవే ఫలితాలు మళ్ళీ పునరావృతమైతే లక్ష మెజారిటి కాదు అసలు గెలవటమే కష్టం అన్నట్లుగా ఉంది పరిస్ధితి. వాస్తవం ఇలాగుంటే చంద్రబాబు మాత్రం లక్ష ఓట్ల మెజారిటిని నిర్దేశించటంతో అందరు ఆశ్చర్యపోయారు. తాజా వ్యాఖ్యలతోనే చంద్రబాబు ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారనే విషయం అర్ధమైపోయింది. వచ్చేఎన్నికల్లో తన గెలుపే కష్టమని చంద్రబాబు నేతల ముందు అంగీకరించాల్సిన అవసరం లేదు. కాకపోతే వాస్తవాలు తెలుసుకుని మెజారిటిని వదిలేసి గెలవాలంటే ఏమిచేయాలో చెప్పమని తమ్ముళ్ళని అడుగుంటే సబబుగా ఉండేది.