అమరావతి : ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోందా ?
వైసీపీలో జరుగుతున్న మార్పులను ఎల్లోమీడియా తట్టుకోలేకపోతున్నట్లుంది. సర్వేలని, ఇంకోటని చాలా లెక్కలు వేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎంఎల్ఏలు, మంత్రుల్లో 11 మంది నియోజకవర్గాలు మార్చేశారు. ఇపుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు కాకుండా కొత్త నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమించారు. బహుశా వీరిని ఈ కొత్త నియోజకవర్గాల్లోనే వచ్చే ఎన్నికల్లో పోటీచేయించచ్చు లేదా పూర్తిగా పక్కకు తప్పించచ్చు. తొందరలోనే మరో 35 నియోజకవర్గాల్లో కూడా మార్పులు తప్పవనే సంకేతాలను జగన్ పంపారు. ఇదిపూర్తిగా వైసీపీ అంరత్గత వ్యవహారం.
ఈ మార్పులపై ముందు తెలుగుదేశంపార్టీ మండిపడింది. ఎందుకంటే ఇలాంటి మార్పులను జగన్ చేస్తారని తమ్ముళ్ళు అస్సలు ఊహించలేదు. ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ జగన్ మళ్ళీ టికెట్లిస్తే ఆ నియోజకవర్గాల్లో టీడీపీ+జనసేన అభ్యర్ధులు ఈజీగా గెలిచేయచ్చని చంద్రబాబునాయుడు అండ్ కో అంచనాలు వేసుకుంటున్నారు. అయితే వీళ్ళు ఊహించని విధంగా నియోజకవర్గాల్లో జగన్ మార్పులు చేస్తున్నారు. జగన్ చేస్తున్న మార్పుల విషయంలో జనాభిప్రాయం తెలీదు కానీ పార్టీలో ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్నారు.
జగన్ ప్లానింగును ఊహించని తమ్ముళ్ళకు షాక్ కొట్టినట్లయ్యింది. అందుకనే జగన్ కు శాపనార్ధాలు పెడుతు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. తమ్ముళ్ళ పరిస్ధితి లాగే ఎల్లోమీడియాకు కూడా షాక్ కొట్టినట్లుంది. ‘పెత్తందార్లకే పెత్తనం’ అనే బ్యానర్ కథనం అచ్చేసింది. వైకాపా సమన్వయకర్తల మార్పుల్లో దళితులు, బీసీలే సమధలంటు గోలచేసింది. అసలు పార్టీలో మార్పులకు ఎల్లోమీడియాకు సంబంధంఏమిటో అర్ధంకావటంలేదు. ఎవరిని ఎక్కడ పోటీచేయించాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది పూర్తిగా జగన్ ఇష్టం.
ఎందుకంటే సర్వేల పేరుతో ఇదే పనిని గతంలో, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదిదే. సర్వేల్లో ఓడిపోతారని తెలిసినా అధినేతలు ఎవరూ సదరు అభ్యర్ధులకు టికెట్లివ్వరన్న కనీస ఇంగితం కూడా ఎల్లోమీడియాలో లేకపోయింది. 29 ఎస్సీ నియోజకవర్గాల్లోను జగన్ మార్పులు చేయబోతున్నట్లు తెగబాధపడిపోయింది. ఎల్లోమీడియా రాతల్లో మార్పుల వల్ల మళ్ళీ వైసీపీ అభ్యర్ధులే గెలిచేస్తారేమో అనే ఆందోళన కనబడుతోంది.
పేరుకు ఎస్సీ ఎంఎల్ఏలున్నా పెత్తనమంతా అగ్రవర్ణాలదే అని చెప్పింది. ఈ పద్దతి వైసీపీలోనే కాదు టీడీపీతో పాటు అన్నీ పార్టీల్లోను ఉన్నదే. అగ్రవర్ణాలకు ధీటుగా రాజకీయాలు చేయగలిగిన ఎస్సీ ఎంఎల్ఏలు తక్కువమందుంటారు. ఎస్సీ ఎంఎల్ఏలు వీకైనచోట అగ్రవర్ణాల నేతలు పెత్తనం చేయటం అన్నీ పార్టీల్లోను ఉన్నదే. తాజామర్పుల వల్ల మళ్ళీ వైసీపీనే గెలిచేస్తుందనే ఆందోళనతోనే పిచ్చిరాతలు రాసినట్లుంది.