హైదరాబాద్ : మోడీకి షాక్ తప్పదా ?

Vijaya

ఎలాగైనా తెలంగాణాలో బీజేపీని అధికారంలోకి తేవాలన్న టార్గెట్ తో నరేంద్రమోడీ పదేపదే పర్యటిస్తున్నారు. 7వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవసభకు హాజరైన మోడీ 11వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే మాదిగల  విశ్వరూప సభకు హాజరవుతున్నారు. అప్పుడు జరిగే బహిరంగసభలోనే ఎస్సీ వర్గీకరణపై మోడీ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇప్పటికే గడచిన నెలరోజుల్లో మోడీ కనీసం ఏడెనిమిది సార్లు తెలంగాణాలో పర్యటించారు.



వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్ లో జరిగిన బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఇదే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా చాలాసార్లు బహిరంగసభల్లో పాల్గొనేందుకు వచ్చారు. 30వ తేదీన ప్రచారం ముగిసేనాటికి మోడీ, అమిత్, నడ్డాలు ఇంకెన్ని సార్లు తెలంగాణాలో పర్యటిస్తారో తెలీదు. సరే ఎన్నిసార్లు పర్యటించినా, ఇంకెన్నిసార్లు వచ్చినా ఏమన్నా ఉపయోగం ఉంటుందా ? అన్నదే అసలు పాయింట్.



కర్నాటక ఎన్నికల్లో కూడా మోడీ చాలాసార్లు పర్యటించారు. రోడ్డుషోల్లో పాల్గొన్నారు, ర్యాలీల్లో ప్రసంగించారు. ఒక లెక్క ప్రకారం కర్నాటకలో రోడ్డుషోలు, ర్యాలీలు, బహిరంగసభలు అన్నీ కలిపి 30 చోట్ల పాల్గొన్నారు. అయినా ఫలితం ఏమిటంటే ఓటమి. కారణం ఏమిటంటే మోడీ తప్ప  పార్టీని ఎన్నికల్లో బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగే నేత కర్నాటక పార్టీలో లేకపోవటమే. అధికారంలో ఉన్నారు కాబట్టి పదవులను అనుభవించారు కానీ పార్టీని మాత్రం జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయారు. ఓకే, మరి తెలంగాణా పరిస్ధితి ఏమిటి ?




సేమ్ టు సేమ్ పార్టీ పరంగా తెలంగాణాలో కూడా కర్నాటక పరిస్ధితే. కర్నాటకలో అయినా బీజేపీ అధికారంలో ఉండి ఓడిపోయింది. తెలంగాణాలో ఆ ముచ్చట కూడా  లేదు. అంతో ఇంతో పర్వాలేదు అన్నట్లుగా  ఉన్న బండి సంజయ్ ను అధ్యక్ష పదవినుండి తప్పించటంతో పార్టీ  మరీ అన్యాయమైపోయింది. ఏ ప్రీ పోల్ సర్వే చూసినా బీజేపీకి మహాయితే ఓ 10 సీట్లోస్తే చాలా ఎక్కువనే చెబుతున్నది. మరి వాస్తవంగా ఎన్నిసీట్లు వస్తాయో  చూడాల్సిందే. మోడీ శ్రమంతా ఏమవుతుందో ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: