గోదావరి : ఇద్దరిలో భయం పెరిగిపోతోందా ?

Vijaya


చంద్రబాబునాయుడును రక్షించుకునేందుకు అన్నీదారులు మూసుకుపోతునట్లున్నాయి. స్కిల్ స్కామ్ లో బెయిల్ రాలేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణ మొదలవ్వబోతోంది. ఫైబర్ గ్రిడ్ స్కామ్, అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు స్కామ్, అంగళ్ళు అల్లర్ల కేసుల్లో ఇంటెరిం బెయిల్ దొరకటంలేదు. ముందస్తు బెయిల్ మీద విచారణ వాయిదాలు పడుతోంది. ఇదే సమయంలో అనేక కేసుల్లో సీఐడీ ఇప్పటికే ఏడు పీటీ వారెంట్లు వేసింది. దీంతో తండ్రి, కొడుకుల్లో భయం పెరిగిపోతోంది.



న్యాయనిపుణుల ప్రకారమైతే ఇప్పుడిప్పుడే చంద్రబాబు జైలులో నుండి బయటకు వచ్చేమార్గం కనబడటంలేదు. అందుకని జైలులోనే చంద్రబాబును హత్య చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోందనే ఆరోపణను లోకేష్ మొదలుపెట్టాడు. చంద్రబాబును అక్రమఅరెస్టు చేయించింది జైలులో అంతంచేయటానికే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయట.  ఆధారాలు లేని కేసులో అరెస్టుచేసి బెయిల్ రాకుండా జైలులోనే చంపేసేందుకు కుట్ర చేస్తున్నారంటు మండిపోయారు.



జడ్ ప్లస్ భద్రత ఉన్న ప్రతిపక్ష నేతకి జైలులోనే హాని తలపెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని పదేపదే ఒకే విషయాన్ని చెప్పారు.  చంద్రబాబుకు జైలులో భద్రతలేదని, విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవటంలేదని లోకేష్ ఆరోపించటమే విచిత్రంగా ఉంది. భద్రత విషయంలో చంద్రబాబుకు ఇంటికన్నా జైలే మేలన్న సీఐడీ లాయర్  వాదనతో కోర్టు ఏకీభవించిన తర్వాతే జైలుకు పంపింది. అలాగే దోమలుకుట్టకుండా చంద్రబాబు దోమతెర వాడుతున్నట్లు సీనియర్ తమ్ముడు యనమల రామృష్ణుడు మీడియాతో చెప్పారు.



ఇదే విషయమై మంత్రులు స్పందిస్తు చంద్రబాబు ఉన్నది జైలులోనే కానీ సెవన్ స్టార్ హోటల్లో కాదని ఎద్దేవాచేస్తున్నారు. జైలులో ఉన్నపుడు దోమలు కుట్టకుండా ఎలాగుంటాయని అడిగారు. దోమలున్నాయని చెప్పినందుకే దోమతెర కడుతున్నట్లు కూడా వివరించారు. చంద్రబాబును మిగిలిన ఖైదీల్లాగ కాకుండా జైలు అధికారులు  ప్రత్యేకంగా చూస్తున్నారన్న విషయం లోకేష్ కు తెలీదా అంటు మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. ఇంటినుండి టిఫిన్, భోజనం, వేడినీళ్ళు తెచ్చుకునేందుకు అధికారులు అనుమతించినా కూడా లోకేష్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం దారుణమని మండిపోతున్నారు. మొత్తానికి చంద్రబాబు హత్యకు ప్లాన్ జరుగుతోందనే ఆరోపణల ద్వారా లోకేష్ జనాల సిపంతికోసం ప్రయత్నిస్తున్నట్లు అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: