అమరావతి : భయపడినంతా అయ్యిందా ?

Vijaya



మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మన్ గా రామోజీరావు భయపడుతున్నదే జరుగుతున్నట్లుంది. మార్గదర్శిని మూయించేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతుందోని రామోజీ ఎల్లోమీడియాలో గోల గోల చేశారు. దానికి తగ్గట్లే శుక్రవారం మొత్తం 37 బ్రాంచీలపైనా సీఐడీతో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారుల బృందాలు దాడులు మొదలుపెట్టాయి. ఖాతాదారులను ఎవరినీ ఎంటర్ కానీయకుండా, ఉద్యోగులను ఎవరినీ బయటకు పోనీయకుండా కంట్రోల్ చేశాయి. అందుబాటులో ఉన్న అన్నీ రికార్డులను స్వాధీనంచేసుకుని తనిఖీలు మొదలుపెట్టారు.



ఏలూరులో బ్రాంచిలో తనిఖీలు పూర్తిచేసిన అధికారులు తాళాలు వేసి ఒక పోలీసును కాపలాగ ఉంచారని రామోజీయే తన పత్రికలో రాసుకున్నారు. ఈ దాడులు మరో మూడురోజులు జరిగేట్లుందని సమాచారం. అంటే అన్నిరోజులు మార్గదర్శి దాదాపు మూతపడటం ఖాయమనే అనిపిస్తోంది. తమను ప్రభుత్వం  వేధిస్తున్నదని, అక్రమాలు, నియమ నిబంధనల ఉల్లంఘనలు లేకపోయినా ఏదో కారణంచెప్పి ప్రభుత్వం తమను ఇబ్బందులు పెడుతోందని రామోజీ లబోదిబో అంటున్నారు. ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని కోర్టు ఆదేశాలున్నా లెక్కచేయటం లేదని గోలచేస్తున్నారు.



కోర్టు ఎలాంటి అసాధారణ చర్యలు తీసుకోవద్దని చెప్పిందే కానీ సోదాలు, విచారణ చేయవద్దని ఎక్కడా చెప్పలేదు. సరే తన పేపర్ తనిష్టం వచ్చినట్లు రాసుకుంటారని తెలిసిందే. అయితే ఈ సోదాల్లో చిట్ ఫండ్ చందాదారుల సంతకాలు కూడా ఫోర్జరీ జరిగిందనే కొత్త విషయం బయటపడిందట. చందాదారులకు తెలియకుండానే చిట్ పాటలు పాడేసి వాళ్ళ సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులను యాజమాన్యమే తీసేసుకుంటోందనే కొత్త విషయం బయటపడింది.



అంటే ఇప్పటివరకు సీఐడీ చెబుతున్నట్లు కేంద్ర చిట్ ఫండ్స్ చట్టం, ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించటమే కాకుండా ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)ని కూడా ఉల్లంఘించారట. ఫోర్జరీ అనేది చాలా పెద్ద నేరం. దీని కింద కూడా బ్రాంచి మేనేజర్లపై కేసులు నమోదయ్యాయట. తమకు వ్యతిరేకంగా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని లబలబలాడుతున్న రామోజీ వ్యతిరేకంగా తప్పుడు వార్తలు రాస్తున్నపుడు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడుతోందా తెలీదా ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: