అమరావతి : అప్పుడే టీడీపీలో మంటపెట్టేసిన శ్రీదేవి
ఇంకా పార్టీలో చేరకుండానే తాడికొండ వైసీపీ సస్పెండెడ్ ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవి చిచ్చుపెట్టేశారు. వైసీపీ నుండి సస్పెండ్ అయిన తర్వాత చాలాకాలం రాజకీయంగా ఎక్కడా కనబడలేదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. వైసీపీలో తలుపులు మూసుకుపోయాయి కాబట్టి టీడీపీలో చేరటం ఒక్కటే ఆమెకు దిక్కు. అయితే టీడీపీలో చేర్చుకోవటానికి చంద్రబాబునాయుడు వెనకాడుతున్నారు. ఇంతకాలం అసలు ఎంఎల్ఏకి అపాయిట్మెంటే ఇవ్వలేదు.
అలాంటిది ఒకవిధంగా ఒత్తిడి తీసుకొచ్చిన ఎంఎల్ఏ ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న చంద్రబాబును కలిశారు. తాజాగా యువగళం పాదయాత్రలో లోకేష్ గుంటూరు జిల్లాలోకి ఎంటరయ్యారు. అమరావతిలో పెద్ద సభ నిర్వహించారు. అమరావతి ఆందోళనలను తెరవెనుకనుండి నడిపిస్తున్నదంతా టీడీపీనే అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఏర్పాట్లుచేసింది కూడా టీడీపీనే. అమరావతికి మద్దతుగా లోకేష్ మాట్లాడుతారు కాబట్టి జనాలు ఎలాగూ వస్తారు, వచ్చారు.
ఇక్కడే ఎంఎల్ఏ ఓవర్ యాక్షన్ మొదలైంది. ఎలాగంటే ఆమె వైసీపీలో ఉన్నంతవరకు లోకల్ గా ఉన్న రైతులను, మహిళలను ఒక ఆటాడుకున్నారు. దాంతో వాళ్ళంతా ఆమెపై బాగా మండిపోతున్నారు. అలాంటిది ఇపుడు లోకేష్ సభలో వేదికపైన అంతా తానే అయి శ్రీదేవి నడిపించారు. ఆందోళనలు చేసి, నిరాహారదీక్షలని చెప్పి, పోరాటాలు చేసి, కేసులు పెట్టించుకుని లాఠీ దెబ్బలు తిన్నది తామైతే లోకేష్ తో కలిసి వేదిక మీద శ్రీదేవి కూర్చోవటం ఏమిటని తమ్ముళ్ళు, అమరావతి ఆడోళ్ళు మండిపోతున్నారట.
ఇంతకాలం అధికారపార్టీలో ఉండి తమపై కేసులు పెట్టించి పోలీసులతో చెప్పి చావకొట్టించిన ఉండవల్లి శ్రీదేవీ వైసీపీ నుండి సస్పెండ్ అయిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. వైసీపీలో సస్పెండ్ అయ్యారు కాబట్టి వేరేదారిలేక టీడీపీలో చేరిన ఆమెకు లోకేష్ కూడా అంత ప్రాధాన్యత ఇవ్వటం ఏమిటని రెచ్చిపోతున్నారు. ఇక ఇప్పటినుండి తమకు శ్రీదేవి నాయకత్వం వహిస్తే తాము ఆమెను అనుసరించాలా అంటు మండిపోతున్నారు. మాజీ ఎంఎల్ఏ తెనాలి sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">శ్రవణ్ కుమార్ కు కూడా ఈ పరిస్ధితి ఏమిటో అర్ధంకావటంలేదు.