అమరావతి : చిరంజీవిని ఎల్లోమీడియా రెచ్చగొడుతోందా ?

Vijaya


ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏమన్నా డెవలప్మెంట్లు జరుగుతారా ? ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతారా అని ఎల్లోమీడియా వెయ్యికళ్ళతో ఎదురుచూస్తుంటుంది. అలాంటి డెవలప్మెంట్ ఏదైనా జరిగితే వెంటనే జగన్ కు వ్యతిరేకంగా కథనాలు, వార్తలతో రెచ్చిపోతుంది. ఇంకేముంది భూమి వైసీపీ పనైపోతోంది, జగన్ పనైపోయిందన్నట్లుగా కథనాలతో కలరింగ్ ఇచ్చేస్తుంది. ఇపుడిదంతా ఎందుకంటే ఏదో సినిమా ఫంక్షన్లో చిరంజీవి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.



చిరంజీవికి సమాధానంగా మంత్రులు, మాజీమంత్రులు కౌంటర్లు ఇచ్చారు. దాన్ని ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోంది.  ఎల్లోమీడియా ఉద్దేశ్యం ఏమిటంటే ప్రభుత్వాన్ని ఎవరు ఏమైనా అనచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం మళ్ళీ ఎదురు కౌంటర్లు ఇవ్వకూడదు. అదేదో సినిమాలో చెప్పినట్లు ఎవరైనా గిల్లితే ప్రభుత్వం గిల్లిచ్చుకోవాలంతే. చిరంజీవికి వ్యతిరేకంగా మంత్రులు, మాజీ మంత్రులు కౌంటర్లు ఇవ్వటం తప్పని మొదలుపెట్టేసింది. ప్రభుత్వం మీద చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదట. ఇదే సమయంలో ఎదురు కౌంబర్లు ఇవ్వటమే తప్పని తేల్చేసింది.



పనిలో పనిగా జగన్ను భయపెట్టే ప్రయత్నం కూడా చేసింది. చిరంజీవి-మంత్రులు, మాజీ మంత్రుల వివాదం బాగా ముదిరిపోయి చిరంజీవి జనసేనకు మద్దతుగా దిగితే ఇంకేమన్నా ఉందా ? అని జగన్ కు వార్నింగ్ ఇవ్వటమే విచిత్రంగా ఉంది. చిరంజీవి గనుక సీరియస్ గా తీసుకుని రంగంలోకి దిగితే వైసీపీ పరిస్ధేంటో ఒక్కసారి ఊహించుకోవాలని భయపెట్టే ప్రయత్నంచేసింది. ఎన్నికలకు ముందే ఇలాంటి ఉంటే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా చిరంజీవి చెలరేగిపోవటం ఖాయమని తేల్చేసింది.



ఇక్కడ ఎల్లోమీడియా కోరిక ఏమిటంటే టీడీపీ+జనసేన పొత్తుపెట్టుకోవాలని, చిరంజీవి రెండుపార్టీలకు మద్దతుగా ప్రచారం చేసి వైసీపీ అభ్యర్ధులను చిత్తుగా ఓడించాలని. చిరంజీవిపై ఒకపుడు ఇదే ఎల్లోమీడియా ఎంత బురదచల్లేసిందో అందరికీ గుర్తుంది. తమకు పనికొస్తారని అనుకుంటే ఆకాశానికి ఎత్తేయటం, నష్టం జరుగుతుందని అనుకుంటే పాతాళంలోకి తొక్కేయటం ఎల్లోమీడియాకు బాగా అలవాటే. చిరంజీవి కూడా ఎల్లోమీడియా బాధితుడే. చిరంజీవికి మంత్రులు, మాజీమంత్రులు కౌంటర్లు ఇవ్వగానే చిరంజీవికి మద్దతుగా ఎల్లోమీడియా రంగంలోకి దిగేసింది. వీళ్ళ మధ్య వివాదాన్ని వీలైనంత పెంచి చిరంజీవిని వైసీపీకి వ్యతిరేకంగా రంగంలోకి దింపాలన్నదే ఎల్లోమీడియా టార్గెట్ గా అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: