గోదావరి : పవన్ చిన్న లాజిక్కు మిస్సవుతున్నారా ?

Vijaya


వారాహి యాత్రలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదే పదే రెండు మూడు మాటలు చెబుతున్నారు. అదేమిటంటే జనసేన అధికారంలోకి వస్తుందని..తానే ముఖ్యమంత్రిని అవబోతున్నానని..తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా ఎవరు ఆపుతారో చూస్తానని. ఎవరు ఆపుతారో చూస్తానన్న మాటను పవన్ డైరెక్టుగా జగన్మోహన్ రెడ్డినే చాలెంజ్ చేస్తున్నారు. ఇక్కడ పవన్ మరచిపోయిన విషయం ఒకటుంది. అదేమిటంటే పోయిన ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీచేశారు.



పోటిచేసిన రెండుచోట్లా పవన్ ఓడిపోయారు. పవన్ను ఓడించింది జగన్ కాదు. జనాలు ఓట్లేయకపోవటం వల్లే పవన్ ఓడిపోయారు. అంటే అసెంబ్లీలోకి పవన్ అడుగుపెట్టకూడదని జనాలు అనుకోబట్టే పవన్ను ఓడించారు. రేపటి ఎన్నికల్లో కూడా అసెంబ్లీలో పవన్ అవసరంలేదని జనాలు అనుకుంటే మళ్ళీ ఓడిగొడతారు. మహాయితే విజిటర్స్ పాస్ మీద పవన్ అసెంబ్లీలోకి అడుగుపెట్టచ్చు. ఇక జనసేనకు ఓట్లేసి గెలిపించండి, తనను ముఖ్యమంత్రిని చేయండని పదేపదే బతిమలాడుకుంటున్నారు.



జనసేన అధికారంలోకి వస్తుందని, తాను సీఎం అవుతానని పవన్ ఎలాగ అనుకుంటున్నారో అర్ధంకావటంలేదు. 175 సీట్లలో పోటీచేయబోయే పార్టీ అధికారంలోకి రావాలంటే కనీసం 88 సీట్లకు పైగా గెలవాల్సుంటుంది. మరి జనసేన ఎన్నిసీట్లుకు పోటీచేయబోతోంది ? టీడీపీతో పొత్తుపెట్టుకుని మహాయితే ఓ 30 సీట్లలో పోటీచేస్తుంది. 30 సీట్లలో పోటీచేస్తే ఎన్నింటిలో గెలుస్తుందో తెలీదు. పోటీచేసేదే 30 సీట్లన్నపుడు ఇక జనసేన అధికారంలోకి వచ్చేదేముంది ? పవన్ సీఎం ఎలావుతారు ?



సహజంగానే బిగ్గర్ పార్టనర్ హోదాలో గెలిచే సీట్ల సంఖ్యను బట్టి చంద్రబాబునాయుడే సీఎం అయ్యేందుకు అవకాశముంటుంది. లాజికల్ గా ఈ విషయం స్పష్టంగా కనబడుతుంటే పవన్ మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా నోటికొచ్చిందేదో మాట్లాడేస్తున్నారు. పొత్తుల సమయంలో చేసుకునే ఒప్పందం కారణంగా కూటమి అధికారంలోకి వస్తే జనసేనకు రెండు లేదా మూడు మంత్రిపదవులు దక్కుతే అదే మహాభాగ్యం. అయినా వారాహి యాత్రతో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తారని అనుకుంటే ప్రతిచోటా టీడీపీనే టార్గెట్ చేస్తున్నట్లున్నారు. జనసేన అధికారంలోకి వస్తుంది, తాను సీఎం అవుతానని పవన్ చెబుతుంటే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోదా ? 









మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: