దిమ్మతిరిగే ట్విస్ట్: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కాలేదట... అసలేమైంది ?

VAMSI
కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయాలు మంచి కాకమీదున్నాయి. నెల్లూరు రురల్ ఎమ్మెల్యే కోటంరెడీ శ్రీధర్ రెడ్డి కి సంబంధించిన వ్యవహారం ఏకంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిందని చెప్పాలి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన స్నేహితుడితో మాట్లాడిన ఒక కాల్ ను ప్రభుత్వం ట్యాప్ చేయించిందని చూపిస్తూ మీడియా సమావేశం నిర్వహించి నమ్మకం లేని చోట నేనుండలేను అంటూ పార్టీని వీడారు. ఈ విషయంలో అటు ప్రజలకు , ఇటు రాష్ట్రంలోని రాజకీయ నాయకులకు నిజంగా ట్యాపింగ్ జరిగిందా ? ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారు ? అస్సలు అధికార పక్షములో ఉన్న ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేయడం వలన ఉపయోగం ఏమిటి అంటూ ఆలోచిస్తూనే ఉన్నారు.
కానీ జగన్ ను నమ్మే వారు మాత్రం ఇది ఫోన్ ట్యాపింగ్ కాదని... శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళడానికి చూపుతున్న ఒక సాకు అని ఆరోజు నుండి చెబుతూనే ఉన్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే మరియు ఎంపీలు,  నాయకులు అంతా కూడా పార్టీకి మద్దతుగా నిలిచారు. నిజాన్ని ఎక్కువ కాలం దాచడం కుదరదు అని తెలిసిందే. అందుకే నిన్న మీడియా ముందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్నేహితుడు మరియు ఆ రికార్డింగ్ లో మాట్లాడిన వ్యక్తి రామశివారెడ్డి వత్త్సవాలను తెలియచేశారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం కోటంరెడ్డి రామశివారెడ్డిలు కాసేపు వారి వ్యాపారాలు గురించి మాట్లాడుకుని , రాష్ట్ర రాజకీయాల గురించి కూడా ఆవేశంగా మాట్లాడాడట.
ఇంకా శ్రీధర్ రెడ్డి చెప్పిన ప్రకారం రామశివారెడ్డి ఫోన్ ఐఫోన్ కాదట.. ఆండ్రాయిడ్ ఫోన్ అని అందులో ఆటోమేటిక్ కాల్ రికార్డ్ ఉందట. ఆ రికార్డును శివారెడ్డ్డి తమ తోటి కాంట్రాక్టర్లకు షేర్ చేశాడట. అది అలా వెళ్లి వైరల్ అయ్యి ఇంత గందరగోళానికి కారణం అవుతుందని ఊహించలేదని తెలియచేశాడు. అంతే కాకుండా శివారెడ్డి నేను చెప్పిన విషయంలో ఏమైనా సందేహాలు ఉన్నా ఫోరెన్సిక్ కు నా ఫోన్ ను పంపించండి అంటూ కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు.. దీనిని బట్టి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళడానికి కుంటిసాకుగా ఈ విషయాన్ని వాడుకున్నట్లు అందరూ అనుకుంటున్నారు. నిన్నటి వరకు ఆయన చెప్పింది నిజమని నమ్మిన నాయకులు ఇది తెలిశాక దూరమయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి చూద్దాం ఏమి జరుగుతుందో... ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: