అమరావతి : కన్నా సమయంకోసం వెయిట్ చేస్తున్నారా ?

Vijaya


కమలంపార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకాలం గుంభనంగా ఉన్న కన్నా మొదటిసారిగా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజుతో తనకు పడటంలేదన్న విషయాన్ని బహిరంగంగా చెప్పారు. మామూలుగా అయితే ఎవరూ ఇలాగ చెప్పరు.  మీడియా ఎంత రెట్టించినా మౌనంగా ఉంటారంతే. కానీ దానికి భిన్నంగా కన్నా మాట్లాడారంటే అర్ధమేంటి ? తొందరలోనే బీజేపీని వదిలేసేందుకు రెడీ అవుతున్నారని అర్ధమైపోతోంది.




వీర్రాజు వియ్యంకుడు బీఆర్ఎస్ లో ఎందుకు చేరారో చెప్పాలంటు మీడియా ద్వారా వీర్రాజును కన్నా డిమాండ్ చేశారు. అంటే వియ్యంకుడినే బీజేపీలోకి తీసుకురాలేని అసమర్ధుడు వీర్రాజు అని కన్నా పరోక్షంగా చురకలంటించినట్లయ్యింది.  దీంతో వీర్రాజుకు కన్నా ప్రశ్న ఎక్కడ తగలాలో సరిగ్గా అక్కడే తగిలింది.  దీంతోనే బీజేపీలో నుండి బయటకు వెళ్ళేందుకు కన్నా ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. మరి బీజేపీలో నుండి బయటకు వచ్చేస్తే ఎటు వెళతారు ? కన్నా ముందు రెండే దారులున్నాయి. మొదటిదేమో టీడీపీలో చేరటం, రెండోదేమో జనసేనలో చేరటం.



పార్టీవర్గాల సమాచారం ప్రకారం జనసేనలో చేరేందుకే ఎక్కువ అవకాశాలున్నాయట. తొందరలోనే బీజేపీ నుండి జనసేన విడిపోయి టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఎంతకాలమున్నా బీజేపీ పుంజుకునే అవకాశం కనబడటంలేదు. పోయిన ఎన్నికల్లో నరసరాపువేట ఎంపీగా పోటీచేసిన కన్నాకు డిపాజిట్ కూడా రాలేదు. వచ్చేఎన్నికల్లో కూడా సేమ్ టు సేమ్ అనేట్లుంది వ్యవహారం. అందుకనే బీజేపీని వదిలేసి జనసేనలో చేరితో బాగుంటుందని అనుకుంటున్నారట.




టీడీపీతో పొత్తుకారణంగా ఈజీగా గెలవచ్చని కన్నా అనుకుంటున్నారట. అందుకనే తాజా డెవలప్మెంట్లపై మాట్లాడుతు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తాను అండగా ఉంటానని ప్రకటించారు. పవన్ కు అండగా బీజేపీ ఉంటుందని చెప్పాల్సిన కన్నా తాను అండగా ఉంటానని చెప్పటంలో అర్ధమేంటి ? జనసేనలోనే కన్నా ఎందుకు చేరాలని అనుకుంటున్నారంటే కాపు సామాజికవర్గంలో కన్నాకు కాస్త పట్టుంది. వచ్చేఎన్నికల్లో కాపుల ఓట్లు+జనసేన అభిమానుల ఓట్లు+టీడీపీ పొత్తుతో తాను గెలిచిపోవచ్చన్నది కన్నా ఆలోచన. అందుకనే బహిరంగంగా వీర్రాజుకు వ్యతిరేకంగా మాట్లాడారు. మరి దీని రిజల్టు ఎలాగుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: