అమరావతి : మోడీ ఇచ్చిన డోసు బాగా పనిచేసిందా ?

Vijaya





అర్ధగంట భేటీలో జనసేన అధినేత  పవన్ కల్యాణ్ కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన డోసు బాగానే పనిచేసినట్లుంది. ఏ డోసైనా సరిగా పనిచేస్తున్నదా లేదా తెలియాలంటే కొంతసమయం ఆగాలి. 11వ తేదీరాత్రి మోడీ ఇచ్చిన డోసు 13వ తేదీ మధ్యాహ్నానానికి పవన్ మీద బాగానే పనిచేసినట్లు అనిపిస్తోంది. ఇక విషయంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యపోరాటాలు చేయబోతున్నట్లు చంద్రబాబునాయుడు, పవన్ జాయింటుగా ప్రకటించిన విషయం తెలిసిందే.



అయితే జగనన్న ఇళ్ళు లబ్దిదారుల కళ్ళల్లో కన్నీళ్ళు అనే నిరసన కార్యక్రమంలో ఎక్కడా టీడీపీ నేతలు కనబడలేదు. నిరసన కార్యక్రమం జరిగిన ప్రాంతాల్లో కేవలం జనసేన నేతలు, కార్యకర్తలు మాత్రమే కనిపించారు. జనసేన టేకప్ చేసిన ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కూడా ఎక్కడా కనిపించలేదు. అంటే జనసేన పార్టీమాత్రమే సింగిల్ గా నిరసనలు మొదలుపెట్టిందని అర్ధమవుతోంది. మొన్నటి భేటీ సందర్భంగా జగన్ను గద్దె దింపాలంటే చంద్రబాబును కూడా కలుపుకోవాలని మోడీకి పవన్ చెప్పినట్లుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.



పవన్ ఎప్పుడైతే చంద్రబాబు ప్రస్తావన తెచ్చారో వెంటనే మోడీ ఆ విషయాన్ని కట్ చేసేశారని సమాచారం. బీజేపీతో కలిసే పవన్ను పోరాటాలు చేయమని మోడీ చెప్పారట. ఎన్నికలకు ఇంకా చాలాసమయం ఉందికాబట్టి పొత్తుల గురించి ఇపుడే చర్చ అవసరంలేదని సున్నితంగానే చెప్పారట. దాంతోనే పవన్ కు అర్ధమైపోయింది చంద్రబాబుతో కలవటం మోడీకి ఇష్టంలేదని.



ఇదే సందర్భంలో బీజేపీతో కలిసి పవన్ చేయాల్సిన పనులు, ఉద్యమాలు తదితరాలపై మోడీ హితబోధ చేశారట. మోడీ టార్గెట్ ఏమిటంటే చంద్రబాబునుండి పవన్ను విడదీయటమే. ఆ విషయం అర్ధమవ్వటంతోనే మోడీతో భేటీ తర్వాత పవన్ మొహం బాగా మాడిపోయింది. అంటే పవన్ కు మోడీ ఏస్ధాయిలో డోసిచ్చారో అర్ధం అవుతోంది. దాని ఫలితమే వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని, జనసేనకు ఓట్లేయాలని ఇంట్లో పెద్దోళ్ళకు చెప్పండి, వైసీపీ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం, జనసేన అధికారంలోకి రావటం ఖాయమంటు చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: