అమరావతి : పవన్ కు ఇప్పటం జనాలు షాకిచ్చారా ?
ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ నెపంతో ప్రభుత్వం 53 ఇళ్ళు కూల్చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంత రచ్చచేశారో అందరు చూసిందే. ఇళ్ళు కూల్చేసి ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని పవన్ జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లేస్తున్నారు. ఇదే సమయంలో తమ ఇళ్ళని ప్రభుత్వం కూల్చలేదని కొందరంటున్నారు. మరికొందరేమో రోడ్డును ఆక్రమించుకుని కట్టుకున్న ప్రహరీగోడలను మాత్రమే కూల్చిందంటున్నారు. అయితే వీళ్ళు చెప్పేది పవన్ వినకుండా గోలగోల చేసేశారు. పైగా ఇళ్ళు కోల్పోయిన వాళ్ళకి తలా లక్షరూపాయల సాయాన్ని కూడా ప్రకటించారు.
తొందరలోనే ఇప్పటం గ్రామానికి వపన్ వచ్చి బాధితులను కలిసి లక్ష రూపాయల చెక్కులను అందించే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. సరిగ్గా ఈ నేపధ్యంలోనే ఇప్పటం గ్రామంలో ఇళ్ళముందు కొన్ని బోర్డులు వెలిశాయి. అందులో ఏముందంటే ‘ప్రభుత్వం మా ఇల్లు ఏమీ కూల్చలేదు...మీఎవ్వరి సానుభూతి మాకుఅవసరంలేదు..డబ్బులిచ్చి అబద్ధాన్ని నిజంచేయాలని ప్రయత్నించవద్దు’ అని రాసుంది. ఇళ్ళకు టులెట్ బోర్డులు పెడతారు కదా అలాంటి బోర్డుల్లాగ పై విధంగా రాసి చాలా ఇళ్ళ గేట్లకు తగిలించారు.
ఇక్కడ పవన్ తెలుసుకోవాల్సిందేమంటే ఎల్లోమీడియాలో కూడా నిజాలు బయటకు వస్తున్నాయి. బ్యానర్ కథనాల్లో ఏమో ఇళ్ళు కూల్చేసినట్లు అచ్చేస్తున్నారు. కానీ మ్యాటర్లోపల ఎక్కడ కూడా ఇళ్ళుకూల్చినట్లు ఉండటంలేదు. కేవలం ఇళ్ళముందున్న నిర్మాణాలు, ప్రహరిగోడలను మాత్రమే ప్రభుత్వం కూల్చేసిందని రాశారు. ఇళ్ళముందున్న నిర్మాణాలంటే ఏమిటి ?
ప్రభుత్వ స్ధలాలను ఆక్రమించుకుని కట్టుకున్న షెడ్లు. ఈ షెడ్లు ఎందుకు వేసుకున్నారంటే వాహనాలను ఉంచుకోవటానికి కావచ్చు లేదా గొడ్లను కట్టేసుకోవటం కోసం కావచ్చు. ప్రభుత్వ స్ధలాలను ఆక్రమించుకున్నారన్న అర్ధంవచ్చేలాగానే రన్నింగ్ మ్యాటర్లో ఉంది. ఈ విషయాన్ని పవన్ గ్రహించకుండానే గ్రామానికి వెళ్ళి గోలగోల చేశారు. మళ్ళీ తొందరలో రెండోసారి వెళ్ళబోతున్నారు. ఈ నేపధ్యంలోనే గ్రామస్తులు తమ ఇళ్ళముందు బోర్డులు తగిలించుకున్నారు. ఇప్పటికైనా ఎల్లోమీడియాను పవన్ గుడ్డిగా ఫాలోఅవటం కాకుండా కాస్త విచక్షణ ఉపయోగిస్తే బాగుంటుంది. లేదంటే నవ్వులపాలవ్వటం ఖాయం.