ఉత్తరాంధ్ర : బీసీ ముసుగులో ఏమిచేసినా చెల్లిపోతుందా ?

Vijaya



బీసీ..బీసీ..బీసీ.. ఎన్నికలు దగ్గరకు వస్తున్నకొద్దీ చంద్రబాబునాయుడు అండ్ కోకు బీసీ జపం ఎక్కువైపోతోంది. బీసీ సామాజికవర్గంపేరు చెప్పి ఏమిచేసినా చెల్లిపోతుదని అనుకుంటున్నట్లున్నారు. అందుకనే బీసీలను వేధిస్తారా ? బీసీలపై కక్షసాధిస్తారా ? బీసీలను రాష్ట్రంలో బతకనివ్వరా ? అంటు బీసీ పేరుతో చంద్రబాబు దగ్గర నుండి కిందస్ధాయివరకు నానా గోలచేస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి విషయంలో కూడా బీసీ కార్డునే వాడుతున్నారు.




చింతకాయల ఇరిగేషన్ శాఖకు చెందిన పంటకాల్వ భూమిని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారన్నది ఆరోపణ. ఇది ఆరోపణ మాత్రమే కాదు ఆధారాలు ఇవిగో అంటు ఇరిగేషన్ శాఖ చూపిస్తోంది. శాఖకు చెందిన 2 సెంట్ల స్ధలాన్ని అయ్యన్న మంత్రిగా ఉండగా కబ్జాచేసేశారు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన ఇంటిజోలికి ఎవరు వెళ్ళలేదు. సీన్ రివర్సయి అయ్యన్న ప్రతిపక్షంలో ఉన్నారు. అదికాకుండా ప్రభుత్వంపైనే కాకుండా డైరెక్టుగా జగన్మోహన్ రెడ్డిని కూడా రెజూ బూతులు తిడుతున్నారు.




దాంతో ఒళ్ళుమండిన ప్రభుత్వం స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకున్నది. ఆదివారం తెల్లవారుజామున అయ్యన్న ఇంటి కాంపౌండ్ వాల్ ను కూల్చేపని మొదలుపెట్టింది. ఇంటిని కాదు కేవలం కాంపౌండ్ ను మాత్రమే. దీనికే అయ్యన్న ఇంటిని ప్రభుత్వం కూల్చేస్తోందని నానా గోల మొదలైపోయింది. తాము ప్రభుత్వ స్ధలాన్ని ఆక్రమించలేదని చెప్పకుండా తమ ఇంటికి అన్నీ అనుమతులు ఉన్నాయని మాత్రమే కుటుంబసభ్యులు చెబుతున్నారు.




అధికారులేమో కాంపౌండ్ గురించి మాట్లాడుతుంటే అయ్యన్నకుటుంబసభ్యులేమో ఇంటిని కూల్చేస్తున్నారంటు గోలచేస్తున్నారు. దీనికి ఛలో నర్సీపట్నం అంటు చంద్రబాబు పిలుపొకటి మళ్ళీ. చంద్రబాబు దగ్గర నుండి అయ్యన్న భార్య దాకా అందరు బీసీలపై కక్షసాధింపనే రచ్చ చేస్తున్నారు. బీసీలైతే ప్రభుత్వ స్ధలాన్ని కబ్జాచేయచ్చా అని వైసీపీలోని బీసీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. హత్య కేసులో కొల్లు రవీంద్రను, రు. 250 కోట్ల కుంభకోణంలో అచ్చెన్నను అరెస్టు చేసినపుడు కూడా బీసీలపై కక్షసాధింపులనే గోలచేశారు. అంటే బీసీల ముసుగులో ఏమి చేసినా అడగకూడదన్నట్లుగానే ఉంది తమ్ముళ్ళ వ్యవహారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: