అమరావతి : టీడీపీ పనైపోవటం ఖాయమేనా ?

Vijaya



ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి వయసు అయిపోతోంది కాబట్టి 2029 ఎన్నికలనాటికి చంద్రబాబునాయుడు పనైపోతోంది. అప్పుడు తెలుగుదేశంపార్టీ జనసేనలోనే లేకపోతే బీజేపీలోనో విలీనం అయిపోతుంది. ఇవి ఢిల్లీలోని బీజేపీ నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చెప్పిన మాటలు. 2029 వరకు వెయిట్ చేస్తే అప్పటి ఎన్నికల్లో పవనే సీఎం అవుతారని కూడా ఢిల్లీలో కమలనాదులు చెప్పారట.




చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకోవాలనే విషయంలో బీజేపీని ఒప్పించేందుకు ఢిల్లీకి వెళ్ళిన పవన్ ఏమీ మాట్లాడలేక తిరిగి వచ్చేశారట. పవన్ ఢిల్లీకి వెళ్ళటం నిజమా కాదా ? ఢిల్లీలోని బీజేపీ పెద్దలు చంద్రబాబు గురించి చెప్పింది నిజమా కాదా అనేది ఎవరికి తెలీదు. నాలుగు గోడల మధ్య కూర్చుని ఒక అగ్రనేత, ఒకమంత్రి, ఒక కీలక నేత, ప్రజాభిప్రాయం, జగన్ను ఓడించటానికి జనాలు డిసైడ్ అయిపోయారనే పిచ్చి రాతలు ఎన్నైనా రాయచ్చు.



ఎల్లోమీడియా చెప్పకనే చెప్పిన  విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలుస్తుందని. అలాగే  మరచిపోయిన లాజిక్ ఏమిటంటే 2024లో టీడీపీ ఓడిపోతే చంద్రబాబు పనైపోవటానికి 2029 వరకు వెయిట్ చేయక్కర్లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందంటే చంద్రబాబు పనైపోయినట్లే అనటంలో ఎవరికీ సందేహాలు అవసరంలేదు. ఎందుకంటే ఇప్పుడే తానేమి మాట్లాడుతున్నారో చంద్రబాబుకు అర్ధంకాకుండా మాట్లాడుతున్నారు.



మొన్నటి ఎన్నికల్లో ఘోరఓటమి దెబ్బ చంద్రబాబు మీద బాగా పడినట్లుంది. అందుకనే లాజిక్ లేకుండా నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఇప్పటికీ చాలామంది తమ్ముళ్ళకి టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందన్న నమ్మకమైతే లేదు. కాకపోతే ఎల్లోమీడియా మద్దతుగా నిలబడిన కారణంగానే పార్టీకి ప్రచారం దక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రవ్వటం పార్టీకన్నా, రాష్ట్రానికన్నా ముందుగా ఎల్లోమీడియా యాజమాన్యాలకే చాలా అవసరం. అందుకనే చంద్రబాబును పార్టీ నేతలకన్నా ఎల్లోమీడియానే అంతలా భుజనేసుకుని మోస్తోంది. ఇందులో భాగంగానే జగన్ పై ఎక్కడలేని బురదా పూసే ప్రయత్నం చేస్తోంది. ఎల్లోమీడియా, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఎంత మొత్తుకున్నా జనాలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరికి ఓట్లేయాలో ఎవరిని మూల కూర్చోబెట్టాలో వాళ్ళకు బాగా తెలుసు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: