అమరావతి : కొడాలి, వంశీ దెబ్బకు లోకేష్ పారిపోయాడా ?

Vijaya


వైసీపీ నేతలతో డైరెక్టుగా మాట్లాడాలంటే నారా లోకేష్ ఎంతగా భయపడుతున్నాడో తాజాగా బయటపడింది. పదవ తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులు, వాళ్ళ తల్లి, దండ్రులతో లోకేష్ గురువారం మధ్యాహ్నం జూమ్ కాన్పరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్సు ఏదైనా జగన్మోహన్ రెడ్డిని, ప్రభుత్వాన్ని అమ్మనాబూతులు తిట్టడమే చంద్రబాబునాయుడు, లోకేష్, తమ్ముళ్ళు టార్గెట్ పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే.



ఇదే పద్దతిలో 10వ తరగతిలో విద్యార్ధులు ఫెయిలవ్వటానికి కూడా కారణం జగన్ ప్రభుత్వం వైఫల్యమే అంటున్నాడు లోకేష్. ప్రభుత్వంమీదకు జనాలను రెచ్చగొట్టడానికే లోకేష ఈ జూమ్ మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ పనేజరుగుతుండగా మీటింగ్ లో అనూహ్యంగా మాజీమంత్రి కొడాలినాని, గన్నవరం టీడీపీ రెబల్ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ ప్రత్యక్షమయ్యారు. దాంతో లోకేష్ కు  ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయ్యింది. అసలు తాను నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్ లోకి వీళ్ళద్దరు ఎలా ఎంటరయ్యారన్నదే పెద్ద ప్రశ్నగా మారింది.



సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఎప్పుడైతే లోకేష్ వీళ్ళిద్దరిని చూశారో వెంటనే వంశీ, నానిలను కట్ చేశారు. ఏ విషయంమీద కూడా లాజికల్ గా మాట్లాడటం లోకేష్ కు తెలీదు. ఎంతసేపు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయటం, జగన్ను నోటికొచ్చినట్లు తిట్టడమే తెలుసు. అలాంటిది 10వ తరగతి పరీక్షల విషయంలో నాని, వంశీలతో మాట్లాడాలంటే లోకేష్ కు నోటమాట కూడా రాలేదు. పైగా వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేస్తారో ? తన సమాధానానికి వాళ్ళ రియాక్షన్ ఎలాగుంటుందో లోకేష్ కు బాగా తెలుసు.



అందుకనే ముందు వాళ్ళిద్దరినీ కట్ చేసి తర్వాత ఏకంగా మీటింగ్ ను రద్దు చేసుకున్నారు. ప్రత్యర్ధులు ఫేస్ టు ఫేస్ ఎదురుపడినపుడు లోకేష్ ఎందుకు భయపడాలి. ప్రభుత్వం, జగన్ మీద తాను చేస్తున్న ఆరోపణలు, విమర్శలు సరైనవే అయితే నాని, వంశీలను ఎందుకు కట్ చేయాలి. తర్వాత మీటింగ్ నే ఎందుకని రద్దుచేసుకోవాలి ? అంటే ట్విట్టర్లోను, మీడియా సమావేశంలో చాలెంజులు చేయటం, నోరుపారేసుకోవటం మాత్రమే లోకేష్ తెలుసు. అంతేకానీ లాజికల్ గా మాట్లాడి ప్రత్యర్ధుల నోళ్ళు మూయించటం తెలీదని అర్ధమైపోయింది. అందుకనే వాళ్ళతో మాట్లాడే ధైర్యంలేక పారిపోయాడు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: