అమరావతి : ఇదే జరిగితే రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయా ?

Vijaya



బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండురోజుల రాష్ట్ర పర్యటన తర్వాత ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్లు జరిగినట్లు సమాచారం. నడ్డా పర్యటనకు ఒక్కరోజు ముందు మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు ఆప్షన్లిచ్చారు. ఈ మూడు ఆప్షన్లు చూసిన తర్వాత తమతో ఎంత తొందరగా విడిపోదామా అన్న ఆలోచనే పవన్లో కనబడుతోందని కమలనాదులకు అర్ధమైపోయింది. అందుకనే పొమ్మనకుండానే పవన్ కు పొగ పెడుతున్నారు.



తామెంత పట్టుకున్నా పవన్ ఆగేట్లులేరని బీజేపీ నేతలకు అర్ధమైపోయింది. అందుకనే తాము కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా అనే విషయంలో చర్చలు మొదలైనాయి. అందుకనే సీట్ల విషయంలో టీడీపీ చర్చలకు రెడీ అయితే పొత్తుగురించి మాట్లాడచ్చని బీజేపీ నేత విష్ణువర్ధనరెడ్డి ప్రకటించారు. సరిగ్గా ఇక్కడే పార్టీలోని కొందర సీనియర్లు మరో ప్రతిపాదనను తెరపైకి తెచ్చారట. అదేమిటంటే ప్రజాబలం లేని, జనాల్లో విశ్వసనీయత కోల్పోయిన, ఎంతమాత్రం నమ్మేందుకు లేని చంద్రబాబుతో పొత్తుపెట్టుకునేకన్నా పెట్టుకునే పొత్తేదో జగన్మోహన్ రెడ్డితోనే ఎందుకు పెట్టుకోకూడదనే ప్రతిపాదన మొదలైందట.



ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండే కేంద్రానికి జగన్ నమ్మదగ్గ మిత్రుడుగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రానికి అవసరమైనపుడల్లా జగన్ మద్దతిస్తున్న విషయాన్ని కొందరు సీనియర్లు గుర్తుచేశారట. కాబట్టి జగన్ తో మాట్లాడి తన ఆలోచనలు ఏమిటో తెలుసుకుని దానికి తగ్గట్లుగా వ్యవహరిస్తే బాగుంటుంది కదాని మాట్లాడుతున్నట్లు సమాచారం.




చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేకన్నా జగన్ తో పొత్తు పెట్టుకుంటేనే బీజేపీకి నాలుగు సీట్లు వస్తాయనే వాదన కూడా కమలంపార్టీలో పెరుగుతోంది. జగన్ తో మాట్లాడి రాష్ట్రప్రయోజనాల కోసం కేంద్రప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే తమతో పొత్తు పెట్టుకోవటానికి జగన్ కు కూడా అభ్యంతరాలు ఉండకపోవచ్చని కొందరు సీనియర్లు అంచనా వేస్తున్నారట. ఇదే విషయాన్ని ముందు నడ్డాతో చర్చించి తర్వాత ఇదే విషయాన్ని నరేంద్రమోడి, అమిత్ షా తో చర్చిస్తే బాగుంటుందని కూడా సీనియర్లలో కొందరు చెప్పినట్లు సమాచారం. ఒకవేళ ఇది వర్కవుటైతే రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా మారిపోవటం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: