అమరావతి : చంద్రబాబు వీక్ నెస్ మీద దెబ్బకొడుతున్నాయా ?

Vijaya



మిత్రపక్షాలకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ  చంద్రబాబునాయుడు భలేగా దొరికేశారు. అధికారంలోకి రావాలన్న చంద్రబాబు  ఏకైక వీక్ నెస్ ను ఆధారంగా చేసుకుని ఒకవైపు జనసేన మరోవైపు బీజేపీ ఓ ఆటాడుకుంటున్నాయి. టెక్నికల్ గా చూస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాల్సిన అతసరం నూరుశాతం చంద్రబాబుకు మాత్రమే ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డే మళ్ళీ అధికారంలోకి వస్తే టీడీపీ పరిస్ధితి దాదాపు కనుమరుగైపోయినట్లే.



తెలంగాణాలో ఇపుడు టీడీపీ పరిస్ధితి ఎలాగుందో ఏపీలో కూడా అలాగే అయిపోతుంది. తనకొడుకు లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలన్న తపన తీరే అవకాశం దాదాపు తీరదనే చెప్పాలి. పార్టీయే కనుమరుగైపోయే పరిస్ధితిలో ఇక లోకేష్ గురించి ఆలోచించే వారే ఉండరు. ఇదే సమయంలో పవన్  ముఖ్యమంత్రి కానపుడు జనసేనకు ఎన్నిసీట్లు వచ్చినా ఒకటే. రాజకీయాలను పక్కనపెట్టేసి హ్యాపీగా సినిమా షూటింగులు చేసుకుంటారు. ఇక బీజేపీ పెట్టుకున్నదే గోచి, అది ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే.



ఏరకంగా చూసుకున్నా, ఏ యాంగిల్లో తీసుకున్నా వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు రాజకీయంగా జీవన్మరణ సమస్యే అనటంలో సందేహంలేదు. జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఎదుర్కొనేంత సీన్ చంద్రబాబుకు లేదని ఎప్పుడో తేలిపోయింది. కాబట్టి వైసీపీని ఓడించాలంటే జనసేన+బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిందే. నరేంద్రమోడి దెబ్బ ఎలాగుంటుందో బాగా తెలుసుకాబట్టి బీజేపీని కాదని పవన్తో మాత్రమే  పొత్తుపెట్టుకునేంత ధైర్యం చంద్రబాబు చేయరు.




రెండుపార్టీలతోను చంద్రబాబు పొత్తుపెట్టుకోవాలంటే వాళ్ళడిగిన సీట్లివ్వాల్సిందే. పల్లకీని మోయటానికి తాను సిద్ధంగా లేనని పవన్ పదే పదే చెబుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి పదవిని కూడా చంద్రబాబు వదులుకోవాల్సొస్తోందేమో. ఏదోరకంగా టీడీపీని బతికించుకోవాలంటే మిత్రపక్షాల డిమాండ్లకు తలొంచటం మినహా చంద్రబాబుకు దారిలేదు. ఈ విషయం బాగా తెలుసుకాబట్టే చంద్రబాబు వీక్ నెస్ మీద మిత్రపక్షాలు దెబ్బమీద దెబ్బ కొడుతున్నాయి. సీఎం కుర్చీమీద పట్టుబట్టి హోలు మొత్తంగా చంద్రబాబు పార్టీని నేలమట్టం చేస్తారా ? లేకపోతే పార్టీని బతికించుకునేందుకు మిత్రపక్షాల డిమాండ్లకు తలొంచుతారా ? చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: