కోస్తా : చంద్రబాబు క్విట్టనగానే జగన్ క్విట్టయిపోతాడా ?

Vijaya



ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనగానే జగన్మోహన్ రెడ్డి క్విట్టయిపోతారా ? మహానాడు ప్రారంభంరోజున చంద్రబాబు ప్రసంగం విన్నతర్వాత అందరిలోను ఇదే అనుమానం మొదలైంది. చంద్రబాబు క్విట్ అనగానే జగన్ ఎందుకు క్విట్టయిపోతారు ? ప్రజలనుకుంటేనే జగన్ క్వట్టయిపోతారు. మరి ప్రజలు నిజంగానే జగన్ క్విట్టయిపోవాలని అనుకుంటున్నారా ? జనాలంతా బలంగా అనుకుని దింపేస్తేనే కదా చంద్రబాబు కూడా అధికారం నుండి దిగిపోయింది.




జగన్ను అధికారంలోనుండి క్వట్ అయ్యే చేయాలంటే చంద్రబాబు చేయాల్సిందేమిటి ? ప్రజల్లో తనపై నమ్మకం కలిగించాలి. ప్రజలు చంద్రబాబును నమ్ముతారా ? 2019 ఎన్నికల్లో జనాలు తెలుగుదేశంపార్టీని ఎందుకంత ఘోరంగా ఓడగొట్టారు ? టీడీపీ ప్రభుత్వం అరాచకాలు, అవినీతి ఆకాశాన్ని అంటాయని జనాలు అనుకోబట్టే. పరిపాలనలో అన్నీవిధాల ఫెయిలయ్యారని అనుకోబట్టే జనాలు వైసీపీకి 151 సీట్ల అఖండమెజారిటిని అందించారు.




రైతు, డ్వాక్రారుణాల హామీలను తుంగలోతొక్కేయటం, కాపులను మోసం చేయటం, బీసీలను దూరంచేసుకోవటం లాంటి అనేక పాలనావైఫల్యాల కారణంగానే వైసీపీకి అంతటి మెజారిటి వచ్చింది. ఇక జగన్ విషయానికి వస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమల్లోకి తెచ్చేశారు. ఇప్పటివరకు అవినీతి ఆరోపణలు లేవు. చిన్న చిన్న ఘటనలు తప్ప ఓవరాలుగా చంద్రబాబు పాలనను జగన్ పాలనను జనాలు భేరీజు వేసుకుంటున్నారు.




జగన్ పాలనపై మూడేళ్ళుగా ఆరోపణలు, విమర్శలు చేస్తు ఎల్లోమీడియాతో బురదచల్లించేస్తున్న చంద్రబాబు తన పాలన ఏ విధంగా మెరుగ్గా ఉంటుందో మాత్రం చెప్పలేకపోతున్నారు. తనను గెలిపిస్తే అమలుచేయబోయే కార్యక్రమాలు, పథకాలు ఏమిటని ఇప్పటివరకు చంద్రబాబు ఎక్కడా చెప్పలేకపోతున్నారు. ప్రజలకు తాను ఏమి చేయబోతున్నారో చెప్పకుండా ఎంతసేపు ‘నువ్వు అధికారంలో నుండి దిగిపో నేను అర్జంటుగా ముఖ్యమంత్రయిపోవాల’ని గోల చేస్తే సరిపోతుందా ? జనాల్లో నమ్మకం సంపాదించుకోనంతవరకు చంద్రబాబు ఎంత గొంతుచించుకున్నా, ఎన్ని మహానాడులు నిర్వహించినా ఏమాత్రం ఉపయోగముండదు. మరి చంద్రబాబును జనాలు నమ్ముతున్నారా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: