పవన్ కల్యాణ్ పై దారుణమైన ట్రోలింగ్.. రియాక్షన్ ఉంటుందా..?

Deekshitha Reddy
పవన్ కల్యాణ్ ని దత్తపుత్రుడంటూ ఇటీవల సోషల్ మీడియాలో వైసీపీ నేతలు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ లోకి సీఎం జగన్ కూడా ఎంటరయ్యారు. మత్స్యకార భరోసా కార్యక్రమంలో పాల్గొన్న జగన్ నేరుగా పవన్ నే టార్గెట్ చేశారు. చంద్రబాబు తన దత్తపుత్రుడైన పవన్ కల్యాణ్ ని నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు.
గతంలో పవన్ కల్యాణ్ తనను దత్తపుత్రుడు అనొద్దని పదే పదే చెప్పేవారు. వైసీపీ వాళ్లు తనని దత్తపుత్రుడు అంటే తాను, జగన్ ని టార్గెట్ చేస్తానన్నారు. జగన్ ని సీబీఐ దత్తపుత్రుడు అంటానని, ఇంకోసారి తనని దత్త పుత్రుడు అనొద్దని చెప్పారు. అయితే ఆ తర్వాత కూడా పవన్ ని జగన్ పూర్తి స్థాయిలో టార్గెట్ చేయడం విశేషం. దానికి పవన్ కల్యాణ్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.
జనసైనికులు ఊరుకుంటారా..?
ఇప్పటికే జనసేన తరపున జనసైనికులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదే పదే పవన్ కల్యాణ్ ని దత్తపుత్రుడు అంటున్నారని మండిపడుతున్నారు. తాము కూడా జగన్ ని విమర్శిస్తామని అంటున్నారు. మొత్తమ్మీద పవన్ కల్యాణ్ ని మరోసారి వైసీపీ దారుణంగా ట్రోలింగ్ చేస్తోంది. ఓవైపు పవన్ కి, ఓట్లు, సీట్లు లేవంటూనే ఆయన్నే టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం అంటున్నారు జనసైనికులు. ఓట్లు, సీట్లు లేకపోయినా తమని చూసి వైసీపీ భయపడుతోందని, ఇదే మార్పుకి నాంది అని అంటున్నారు.
పవన్ రియాక్షన్ ఉంటుందా..?
పవన్ కల్యాణ్ త్వరలో జగన్ కామెంట్స్ పై రియాక్ట్ అవుతారని తెలుస్తోంది. ఇకపై నేరుగా ఆయన రంగంలోకి దిగుతారని, తన తరపున ఎవరూ మాట్లాడకుండా, తానే బదులిస్తారని అంటున్నారు. చంద్రబాబుతో పొత్తుపై ఇప్పటికే సంకేతాలిస్తున్నారు పవన్. వైసీపీ మాత్రం ఆల్రడీ ఆ రెండు పార్టీలో పొత్తులో ఉన్నాయంటోంది. ఈ దశలో పవన్ కల్యాణ్ నేరుగా చంద్రబాబు తరపున జగన్ పై మాటల దాడి చేస్తారా..? తనకు తానే జనసేన తరపున రియాక్ట్ అవుతారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: