ఫోన్ టార్చ్ వెలుగులో ఆపరేషన్ చేసిన వైద్యులు.. చివరికి?

praveen
నేటి జనరేషన్లో కనిపించే దైవం ఎవరు అంటే వైద్యులు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే గుడిలో ఉండే దేవుడు కోరిన కోరికలు తీరుస్తాడో లేదో కానీ.. ప్రాణాపాయంతో ఆసుపత్రికి వెళ్తే వైద్యుడు తప్పకుండ ప్రాణాలను నిలబెడతాడు అని నమ్ముతూ ఉంటారు జనాలు.  కరోనా వైరస్ తర్వాత డాక్టర్ వృత్తి ఎంత గొప్పది అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఈ క్రమంలోనే డాక్టర్లను మరింతగా గౌరవించడం కూడా మొదలుపెట్టారు.

 అయితే కొంతమంది డాక్టర్లు మాత్రం ఏకంగా పేషెంట్ల విషయంలో యమకింకరులుగా మారిపోతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ప్రాణాపాయంతో తన దగ్గరికి వచ్చిన పేషెంట్లకు ఏకంగా నిర్లక్ష్యంగా చికిత్స చేస్తూ ప్రాణాలు నిలబెట్టాల్సిన డాక్టర్లు చివరికి పేషంట్ల ఉసురు పోసుకుంటున్నారు. ఇక కొంతమంది డెలివరీ కోసం వచ్చి గర్భిణీల విషయంలో కూడా డాక్టర్లు ఇలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  ఏకంగా ఓ గర్భిణీకి ఆపరేషన్ చేసి డెలివరీ చేస్తున్న సమయంలో కరెంటు పోయింది. అయితే ఆసుపత్రిలో జనరేటర్ ఉన్నప్పటికీ ఆన్ చేయకుండా సెల్ఫోన్ టార్చ్ పెట్టుకొని ఆపరేషన్ పూర్తి చేశారు.

 చివరికి తల్లి బిడ్డ ఇద్దరు మృతి చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబైలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఫోన్ టార్చ్ వెలుగులోనే ఓ గర్భిణీకి సిజేరియన్ నిర్వహించగా తల్లి బిడ్డ చనిపోయారు. విద్యుత్ నిలిచిపోయిన మూడు గంటల వరకు జనరేటర్ ఆన్ చేయలేదు వైద్యులు. అలాగే ఆపరేషన్ కొనసాగించారు. దీంతో రెండు ప్రాణాలను బలి తీసుకున్నారు. అయితే ఇంత జరిగినా అదే చీకట్లో సిబ్బంది మరో మహిళకు కూడా డెలివరీ చేశారు అని మృతురాలి భర్త అన్సారీ చెప్పుకొచ్చారు. బీఎంసీ పరిధిలో ఉన్న  ఈ ఆసుపత్రి పై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ అన్సారి డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: