రాజస్థాన్ ఓడినా.. రియాన్ పరాగ్ అరుదైన రికార్డ్?

praveen
2024 ఐపీఎల్ సీజన్ లో పూర్తిగా బ్యాట్స్ మెన్ లదే ఆధిపత్యం కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే స్టార్ ప్లేయర్లుగా నిరూపించుకున్న ఆటగాళ్ల కంటే ఇక కొత్తగా నిరూపించుకోవాలి అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న యువ ఆటగాళ్లదే ఈ ఐపీఎల్లో హవా కొనసాగుతూ ఉంది. ప్రతి మ్యాచ్ లో కూడా వచ్చిన అవకాశాన్నియోగం చేసుకుంటూ అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నారూ ఎంతో మంది యంగ్ ప్లేయర్లు. ఇలా మంచి ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న ఆటగాళ్లలో అటు రియాన్ పరాగ్ కూడా ఒకరు.

 గత రెండు మూడు సీజన్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో ఇక సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని.. బిల్డప్ లకు పోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక 2024 ఐపిఎల్ సీజన్లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా బ్యాటింగ్ విధ్వంసం  సృష్టిస్తున్నాడు అని చెప్పాలీ. ఇక ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా మంచి ప్రదర్శన చేశాడు. 157.14 స్ట్రైక్ రేట్తో 49 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు నాలుగు ఫోర్లు ఉండటం గమనార్హం.

 అయితే ఇటీవల జరిగిన మ్యాచ్లో చేసిన 77 పరుగుల ఇన్నింగ్స్ ద్వారా అరుదైన రికార్డు సృష్టించాడు.  ఈ సీజన్లో 400కు పైగా పరుగులు చేసిన తొలి అన్ క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు. నిన్నటి మ్యాచ్లో అర్థ సెంచరీ ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. మొత్తంగా ఈ సీజన్లో 10 మ్యాచ్లలో 409 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి అని చెప్పాలి. ఇక మరోవైపు ఐపీఎల్లో 1000 పరుగులను కూడా పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించారు అని చెప్పాలి. కాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పడి వరకు పది మ్యాచ్ లలో ఎనిమిది మ్యాచ్లు గెలిచి దాదాపు ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: