రేవ్ పార్టీ వార్తలపై స్పందించిన జానీ మాస్టర్..!

Pulgam Srinivas
ఈ రోజు ఉదయం నుండి తెలుగు సినీ పరిశ్రమను రేవ్ పార్టీ వార్త ఊపేస్తుంది. నిన్న రాత్రి బెంగళూరులో ఓ ప్రముఖ వ్యక్తి పుట్టిన రోజు జరిగింది అని , అందుకోసం ఓ భారీ రేవ్ పార్టీని కొంత మంది ఏర్పాటు చేసినట్లు , దానికి అనేక తెలుగు సినీ ప్రముఖులు కూడా హాజరు అయినట్లు ఉదయం నుండి వార్తలు వస్తున్నాయి. తెలుగు సినీ ప్రముఖ నటులు అయినటువంటి హేమా మరియు శ్రీకాంత్ కూడా ఈ రేవ్ పార్టీ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనితో హేమ నేను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదు. నేను హైదరాబాదులోని ఓ ఫామ్ హౌస్ లో ఉన్నాను.

అక్కడే నేను ఎంజాయ్ చేస్తున్నాను. అంతే కానీ బెంగళూరు లో రేవ్ పార్టీలో నేను ఉన్నాము అని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం అవాస్తవం అని ఈమె వీడియో విడుదల చేసింది. ఇక ఆ తర్వాత శ్రీకాంత్ కూడా నేను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదు. నేను నా ఇంట్లోనే ఉన్నాను. నాకు అలాంటి కల్చర్ అన్నా కూడా ఏ మాత్రం ఇష్టం ఉండదు. కొన్ని రోజుల క్రితం నా భార్యతో విడాకులు తీసుకున్నాను అని వార్తలు రాశారు.

ఇప్పుడేమో ఇలా వార్తలు రాస్తున్నారు. వాటిని నమ్మకండి. నేను ఏ రేవ్ పార్టీకి వెళ్ళలేదు అని ఈయన కూడా వీడియోను విడుదల చేశాడు. ఇకపోతే కొంత సమయం నుండి ఈ రేవ్ పార్టీకి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ లలో ఒకరు అయినటువంటి జానీ మాస్టర్ కూడా వెళ్లారు అని వార్తలు వస్తున్నాయి.

దానితో ఈయన తన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. జానీ మాస్టర్ తాజాగా ఈ రేవ్ పార్టీ విషయంపై స్పందిస్తూ ... నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే మొదటి విషయం నాకు అటువంటి అలవాట్లు లేవని. అనవసరంగా నాపై , మా జనసేనాని పై బురద జల్లే ప్రయత్నం ఇది.

ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల ఏడుపులు తొందర్లోనే వింటాం. ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్న, షేర్ చేస్తున్న వారి మనస్థితి పై జాలేస్తుంది అని తన సోషల్ మీడియా అకౌంట్ లో జానీ మాస్టర్ తాజాగా ఓ పోస్ట్ చేశాడు. జానీ మాస్టర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Jm

సంబంధిత వార్తలు: