సిక్స్ ప్యాక్ తో షాక్ ఇచ్చిన యంగ్ హీరో ఆనంద్..!!

murali krishna
విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో ఆనంద్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. అన్నకే ఇంకా స్టార్ డమ్ రాలేదు.. ఇప్పుడు తమ్ముడు కూడా వచ్చేశాడు.తొలుత ఆయన నటించిన సినిమాలు యావరేజ్ గా నిలిచాయి.‘బేబి‘ సినిమాతో ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకున్నారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ పెద్ద విజయాన్ని అందుకుంది. పలువురు సినీ పెద్దలతో పాటు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. వైష్ణవి చైతన్య, ఆనంద్ నటన అద్భుతం అంటూ అభినందించారు. ఈ సినిమా తర్వాత ఆనంద్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన బేబీ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం ఈ నెల చివరన గం గం గణేశా సినిమాతో రాబోతున్నాడు. యూత్ ఫుల్, యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు ఆనంద్ దేవరకొండ.తమ్ముడు హీరో అవ్వడం ఇష్టంలేకపోయినా విజయ్.. అతడి ఆనందం కోసం సపోర్ట్ గా నిలిచాడు. మూడు, నాలుగు సినిమాలా తరువాత బేబీ అనే సినిమాతో ఆనంద్ కు బ్రేక్ దొరికింది. అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా బేబీ నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆనంద్ వరుస సినిమాలను లైన్లో పెట్టి ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆనంద్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి గంగం గణేశా.ఉదయ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ మంచి ప్రేక్షకాదరణ పొందాయి.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఆనంద్ లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో ఒక సిక్స్ ప్యాక్ ఫోటోతో షాక్ ఇచ్చాడు. ఆనన్ దేవరకొండ సిక్స్ ప్యాక్ చూసి ఆడియన్స్ అంతా షాక్ అయ్యారు. ఇంతకీ ఆనంద్ ఎందుకు ఈ సిక్స్ ప్యాక్ చేసి ఉండొచ్చని ఆరా తీస్తున్నారు. అయితే ఆనంద్ నెక్స్ట్ సినిమా యాక్షన్ ప్రాజెక్ట్ గా రాబోతుందట.ఆ సినిమాలో మాస్ హీరోగా ఆనంద్ కనిపిస్తాడని టాక్. అందుకే ఆనంద్ ఇలా వర్క్ అవుట్ చేసి తన మేకోవర్ చూపించాడు. ఆనంద్ సిక్స్ ప్యాక్ లుక్ రౌడీ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. విజయ్ దేవరకొండ కి అర్జున్ రెడ్డి పడినట్టుగా ఆనంద్ కూడా తన సొంతంగా ఒక సోలో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. బేబీ హిట్ అయినా అది డైరెక్టర్, హీరోయిన్ సగం మార్కులు కొట్టేశారు. ఆనంద్ కూడా సాలిడ్ హిట్ కొడితే రౌడీ ఫ్యాన్స్ అతన్ని కూడా స్టార్ ని చేసేందుకు రెడీగా ఉన్నారు.ఆనంద్ దేవరకొండ గం గం గణేశా తర్వాత ఏ సినిమాతో చేస్తాడు. అందులో ఆనంద్ ఎలా కనిపిస్తాడు అన్నది త్వరలో తెలుస్తుంది. ప్రజెంట్ మాత్రం ఆనంద్ సిక్స్ ప్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇప్పుడు ఆనంద్ కు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: