ఓటీటీ లో మరింత ఆలస్యంగా సుహాస్ శ్రీరంగనీతులు..!?

Anilkumar
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న సుహాస్ ఇటీవల ప్రసన్నవదనం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా ఫేస్ బ్లైండ్నెస్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో థియేటర్స్లోకి వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. పాయల్ రాధాకృష్ణ రాశి సింగ్  హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీ లోకి కూడా రాబోతోంది. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమా 24 నుండి ఓటీటీ లోకి రాబోతోంది. ఇక ఈ సినిమా కంటే ముందు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాతో

 మరొక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు సుహాస్ .ఈ సినిమా తర్వాత ఆయన నటించిన మరొక సినిమా శ్రీరంగనీతులు. అయితే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న తర్వాత ఓటీటీ లో సైతం భారీ రెస్పాన్స్ అందుకుంది. ఇక త్వరలోనే ప్రసన్నవదనం సినిమా కూడా ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఏప్రిల్ 11  ఓటిటి లోకి రాబోతోంది. మరి ఈ రెండు సినిమాల మధ్య లో విడుదలైన శ్రీరంగనీతులు సినిమా మాత్రం ఇంకా ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వలేదు.   ఈ సినిమాలో సుహాస్ తో

 పాటు బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ సైతం నటించాడు. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ రత్నం సైతం నటించారు. అలాగే హీరోయిన్ రుహాని శర్మ సైతం  నటించారు. అయితే సుహాస్ నటించిన శ్రీరంగనీతులు సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఓటీటీ లోకి రాకపోవడంతో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా సమాచారం వినబడుతోంది. శ్రీరంగనీతులు సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ  సోనీ లివ్ భారీ ధర కి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను జూన్ 7 నుండి స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే థియేటర్లో వచ్చి రెండు నెలలు అయిన తర్వాత ఈ సినిమా ఓటీటీ లోకి రాబోతోందన్నమాట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: