అఖండ -2 ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా సరే ఈ సినిమా పేరే మార్మోగిపోతుంది. దానికి ప్రధాన కారణం ఒక బిగ్ పాన్ ఇండియా మూవీ వాయిదా పడడమే. అఖండ -2 మూవీ డిసెంబర్ 5న విడుదల కాబోతుందని ఎప్పటినుండో ప్రచారం జరిగింది. ఇక అందరూ అనుకుంటున్నట్లే డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. సినిమా విడుదలకు ముందు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేశారు. ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. కానీ సడన్గా అఖండ -2 సినిమా విడుదలకు ముందు వేసే ప్రీమియర్స్ ఆగిపోయాయి.అయితే టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రీమియర్స్ పడలేదు కానీ ఉదయాన్నే సినిమా కచ్చితంగా థియేటర్లో చూస్తామని ఎంతో మంది అభిమానులు ఆశపడ్డారు. కానీ సినిమా వాయిదా పడిందని చావు కబురు చల్లగా చెప్పినట్టు నిర్మాతలు ప్రకటించడంతో బాలకృష్ణ అభిమానుల కోపం కట్టలు తెంచుకుంది.
దీంతో ప్రొడ్యూసర్లను ఏకిపారేస్తూ ఎంతోమంది వైరల్ పోస్టులు పెట్టారు. ఇదంతా పక్కన పెడితే అఖండ-2 విడుదల వాయిదా పడ్డ నేపథ్యంలో బాలకృష్ణపై రోజా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే అఖండ-2 సినిమా వాయిదా పడ్డందుకు రోజా సంబరపడి కామెంట్లు చేసింది అనుకుంటే పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే అఖండ-2 మూవీ గురించి కాదు గతంలో బాలకృష్ణతో తనకి ఉన్న బంధం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో మరో సారి వైరల్ అవుతుంది. అదేంటంటే.. బాలకృష్ణ నేను ప్రతిపక్ష పార్టీలలో ఉన్నప్పటికీ బాలయ్య బాబు ఎప్పుడు కనిపించినా నేను ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి మాట్లాడతాను. చాలా సార్లు మమ్మల్ని చూసిన వాళ్ళు ఇదేంటి మీరిద్దరూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు..ఫైట్ చేస్తారు అనుకుంటే ఇలా ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు ఏంటి అని ఆశ్చర్యపోతారు.
బాలయ్య బాబు ఎక్కడ కనిపించినా నేను హాయ్ బాబు గారు ఎలా ఉన్నారని మాట్లాడతాను. రాజకీయంగా విమర్శలు తప్ప పర్సనల్గా మా మధ్య ఏ గొడవలు లేవు. బాలకృష్ణతో నేను అన్ని జానర్ లలో సినిమాలు చేశాను. ఆయనతో సినిమాలు చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది. షూటింగ్ సెట్ లో ఆయన చుట్టూ అందరినీ కూర్చోబెట్టుకొని జోక్స్, కథలు ఇలా ఎన్నో చెబుతారు. మా ఇద్దరి కాంబోలో వచ్చిన భైరవద్వీపం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. అలాగే నేను ఎక్కడ కనిపించినా బాలయ్య బాబు నన్ను క్వీన్ అని పొగుడుతారు అంటూ చెప్పుకొచ్చింది.ప్రస్తుతం రోజా మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.