ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్న జపాన్ ఫ్యాన్స్..!?

Anilkumar
మొన్నటి వరకు జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అంటే కేవలం టాలీవుడ్ వరకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు తారక్. త్రిబుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ చేరిందో l ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. ప్రపంచం మొత్తం ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి గ్లోబల్ స్టార్ పుట్టినరోజు ఇవాళ. ప్రస్తుతం ఆయన పుట్టినరోజు వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు అందరూ పెద్ద ఎత్తున

 జరుపుకుంటున్నారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఇండియా సినిమాలు ప్రారంభించక ముందు నుండి ఆయనకి ఇతర దేశాల్లో అభిమానులు ఉండేవారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కి జపాన్లో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఎప్పటినుండో జూనియర్ ఎన్టీఆర్ పాటలకు జపాన్ అభిమానులు డాన్స్ చేయడం డైలాగ్స్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు. అలా జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు దేశాలను దాటింది .ఇందులో భాగంగానే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సోషల్ మీడియా

 వేదికగా ఆయన అభిమానులు సినీ సెలబ్రిటీలు  అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో పాటు తదితరులు చాలామంది సోషల్ మీడియా వేదికగా తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తాజాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..  ఈ వీడియోలో జపాన్ ఫ్యాన్స్ తారక్ బర్త్ డేను సెలబ్రేట్ చేశారు. ఎన్టీఆర్ కటౌట్ ను ఏర్పాటు చేసి తారక్ మేడలో మల వేసి పూలు చల్లుతూ డాన్స్ చేశారు. ఎన్టీఆర్ బృందావనం లోని చిన్నదో వైపు పెద్దోవైపు సాంగ్ కు డాన్స్ చేస్తూ ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఎన్టీఆర్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: