అమరావతి : టీడీపీ మరీ ఇంత దిగజారిపోయిందా ?

Vijaya



తెలుగుదేశంపార్టీ ఇంతగా దిగజారిపోయిందంటే వినటానికే ఆశ్చర్యంగా ఉంది. ప్రతిరోజూ జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లాలని టార్గెట్ గా పెట్టుకున్నారు చంద్రబాబునాయుడు, లోకేష్ అండ్ కో. కానీ ప్రతిరోజు బురదచల్లటానికి మ్యాటర్ ఎక్కడ దొరుకుతుంది ? అందుకనే దొరికిన మ్యాటర్ నే ఏదోరూపంలో ఎల్లోమీడియా ద్వారానో లేకపోతే తమ సోషల్ మీడియా గ్రూపుల ద్వారానో వైరల్ చేయించేందుకు నానా అవస్తలు పడుతున్నారు.



మామూలుగా ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుందా ఎప్పెడెప్పుడు ఉతికి ఆరేద్దామా అని ప్రతిపక్షాలు ఎదురు చూస్తుంటాయి. ఈ విషయంలో ప్రతిపక్షాలను తప్పుపట్టడానికి ఏమీలేదు. అయితే ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయినట్లు ప్రభుత్వంపై బురదచల్లాలంటేనే ఇబ్బంది. ఇపుడు టీడీపీకి ఎదురైన సమస్యిదే. తాజాగా ముస్లిం సోదరులను జగన్ అవమానించారంటు టీడీపీ తన ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టింది. దాన్ని వైరల్ చేయటానికి తమ్ముళ్ళు నానా అవస్తలు పడుతున్నారు.



ఇంతకీ విషయం ఏమిటంటే ప్రభుత్వం రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందిచ్చింది. ఈ విందులో పాల్గొన్న ముస్లింలలో కొందరు నెత్తిన టోపీ పెట్టుకోమంటే జగన్ వద్దన్నారు. నెత్తిన టోపీ పెట్టుకోవటానికి జగన్ నిరాకరించారు కాబట్టి ముస్లింలను అవమానించినట్లే అనేది తమ్ముళ్ళు ప్రచారం చేస్తున్నారు. గతంలో ఇదే జగన్ ఎన్నో దర్గాల్లో ప్రార్ధనలు చేశారు. టోపీలు పెట్టుకున్నారు, సంప్రదాయంగా భుజాల చుట్టూ వస్త్రాన్ని కప్పుకున్న విషయం అందరికే తెలిసిందే.



ఇక్కడ విషయం ఏమిటంటే జగన్ను తప్పుపట్టడమే టార్గెట్ గా పెట్టుకున్న విషయం అర్ధమైపోతోంది. తిరునామాలు పెట్టుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళితే నామాలు పెట్టుకుని హిందువులను మోసం చేస్తున్నాడంటారు. బ్రహ్మోత్సవాలకు హాజరైతే భార్యను తీసుకురాకుండా హైందవ సంప్రదాయాన్ని అవమానించాడంటారు. గోపూజలో భార్యతో పాల్గొంటే ఇంకోటంటారు. పూజలో పాల్గొనకపోతే మరొకటంటారు. ఇవన్నీ చూసిన తర్వాత టీడీపీ మరీ ఇంతగా దిగజారిపోయిందా ? అని ఆశ్చర్యంగా ఉంది. నిజానికి వీటివల్ల టీడీపీకి జనాల్లో వచ్చే మైలేజీ ఏమీ ఉండకపోగా నెగిటివ్ తప్పదు. మరీ విషయాన్ని చంద్రబాబు, లోకేష్ ఎందుకు గ్రహించటంలేదో అర్ధం కావటంలేదు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: