అమరావతి : బీజేపీ గెలుపు ఏపీకి నష్టమేనా ?

Vijaya





నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం ఏపీ చావుకొచ్చింది. ఇప్పుడే ఏపీ అభివృద్ధిని, ప్రయోజనాలను కేంద్రప్రభుత్వం గాలికొదిలేసింది. ఏపీ అభివృద్ధికి సహకరించమని ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. తన అవసరార్ధం వైసీపీ ఎంపీల మద్దతును తీసుకుంటోంది కానీ ఏపి అభివృద్ధికి మాత్రం సహకరించటంలేదు. దీనికి చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బాధ్యత వహించాల్సిందే. పొరుగు రాష్ట్రాలను చూసి కూడా వీళ్ళల్లో మార్పు రాకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. 



వీళ్ళద్దరు కూడా తమ వ్యక్తిగత ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టేస్తున్న విషయం అందరికీ అర్ధమవుతోంది. అసలు తప్పు చంద్రబాబులో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత మొదటి సీఎంగా పనిచేసిన చంద్రబాబు తన అవసరాల కోసం నరేంద్రమోడి ముందు సాగిలపడ్డారు. చంద్రబాబు బలహీనతను అడ్వాంటేజ్ తీసుకున్న మోడి ఏపీ ప్రయోజనాలకు పూర్తిగా గండికొట్టేశారు. ప్రత్యేకహోదా, వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ హామీలు గాలికి కొట్టుకుపాయి. ఇక  పోలవరం ప్రాజెక్టు పనులు అనుకున్నంతగా  ముందుకు సాగకపోవటం పూర్తిగా చంద్రబాబు తప్పులే.




ఆ తప్పులనే ఇపుడు జగన్ కూడా కంటిన్యు చేస్తున్నారు. ఐదురాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి దెబ్బపడాలని సగటు ఆంధ్రుడు కోరుకున్నాడు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో మళ్ళీ గెలుపు కోసం మోడి గట్టి మిత్రలు కోసం వెతుకుతారని తెలుసు. ఇందులో భాగంగానే జగన్ తో పొత్తు పెట్టుకుంటారని, అప్పుడు ఏపీ ప్రయోజనాల విషయంలో ఎంతోకొంత సానుకూలంగా ఉండకపోతారా అని జనాలు ఎదురుచూశారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 





తాజా విజయంతో ఏపీ గురించి కేంద్రం పట్టించుకోదాని జనాలందరికీ స్పష్టమైపోయింది. ఏపీకి కేంద్రం అంతచేస్తోంది ఇంతచేస్తోందంటు లోకల్ లీడర్లు చెప్పే సొల్లు మాటలను జనాలు పట్టించుకోవటంలేదు. మొత్తంమీద 2024 ఎన్నికల వరకు బీజేపీ హవాను ఎవరు ఆపలేరన్నది అర్ధమవుతోంది. కాబట్టి ఏపీ ప్రయోజనాలను కేంద్రం పట్టించుకునే అవకాశం లేదంతే. ఇందుకే నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం ఆంధ్రాకు నష్టమనే జనాలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: