చేదు వార్త: ఆకాశానికి ఆయిల్ ధరలు.. సామాన్యుడు బతికేదెలా..!

MOHAN BABU
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఎఫెక్ట్ దేశంతో పాటు రాష్ట్రం పైన పడనుంది. సన్ ఫ్లవర్ ఆయిల్ ను ఈ రెండు దేశాల నుంచి సుమారు 90 శాతం వరకు భారత్ దిగుమతి చేసుకుంటుంది . వీటితో పాటుగా ఈ దేశాల నుంచి క్రూడాయిల్, బొగ్గు, పాలిమర్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ముడిసరుకులు దిగుమతి అవుతున్నాయి. యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలో వీటి ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. యుద్ధం ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటని పారిశ్రామిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 భారత్ నుంచి రష్యా, ఉక్రెయిన్ కు ఔషధాలు, మిషనరీ, ఆర్గానిక్స్, రసాయనాలు, ఆహారోత్పత్తులు మన దగ్గర నుంచి ఎగుమతి అవుతున్నాయి. యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే ముడి సరుకు రవాణా తగ్గుతుంది. ఫలితంగా ఉత్పత్తి సైతం తగ్గడంతోపాటు పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. గతేడాది భారత్ 1.89 మిలియన్ టన్నుల సన్ఫ్లవర్ నూనె ను దిగుమతి చేసుకోగా అందులో 70 శాతం ఉక్రెయిన్, 20 శాతం రష్యా నుంచి వచ్చింది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ నుంచి సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుత పరిస్థితులు మరో రెండు మూడు వారాలు కొనసాగితే భారత్ లో ఆయిల్ కొరత తీవ్రమయ్యే ఛాన్సుంది. ఇప్పటికే ధరలు పెరుగుతాయని భావించిన ప్రజలు ఎక్కువ మొత్తంలో  కొనుగోలు చేస్తున్నారు. ఒక్కరోజే సుమారు రెండింతల  కొనుగోళ్లు జరిగినట్లు దుకాణ, మార్ట్ యజమానులు చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే సన్ ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్ కు 30 నుంచి 40 వరకు పెరిగే అవకాశం ఉంది  గోధుమలను సైతం ఉక్రెయిన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల వల్ల గోధుమల ధరలు సైతం పెరిగే ఛాన్స్ ఉంది. యుద్ధం నేపథ్యంలో రష్యా ఉత్పత్తులపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తే ధరలు పెరిగే ప్రమాదం ఉంది. భారత్ కు రష్యా నుంచి గ్యాస్ చమురు తో పాటు వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. అవి నిలిచిపోతే దేశంలో కొరత ఏర్పడి

 ధరలు పెరిగే అవకాశం ఉంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తుతం అంత ఎఫెక్ట్ చూపకపోయినా భవిష్యత్తులో మాత్రం తప్పక ప్రభావం ఉంటుంది. రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. యుద్ధం కొనసాగితే నాటో కూటమి నాటో కూటమి ఉక్రెయిన్ కు మద్దతు తెలిపి మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలికితే అన్ని రంగాలపై ప్రభావం పడుతుంది. దేశంలో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగి పోతాయి. డీజిల్, పెట్రోల్, నూనె ధరలు ఆకాశాన్నంటుతాయి. ముడిసరుకు పై ఆధారపడిన పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: