పంజాబ్ : పంజాబ్ ఎన్నికల్లో ‘డేరా’ సంచలనం ?

Vijaya


పంజాబ్ ఎన్నికల్లో అనూహ్య సంఘటన జరిగింది. పంజాబ్, హర్యానాలో ఎంతో పాపులరైన డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీం జైలు నుండి విడుదలయ్యారు. పంజాబ్ లో పోలింగ్ కు  పదమూడు రోజుల ముందు డేరాబాబా హర్యానాలోని రోహతక్ జైలు నుండి రిలీజవ్వటం సంచలనంగా మారింది. ఎందుకంటే డేరాబాబాకు పంజాబ్, హర్యానాలో కోట్లాదిమంది భక్తులున్నారు. డేరా సచ్చా సౌథా పేరుతో ఆశ్రమం (?)నడుపుతున్న డేరాబాబాకు ఐదేళ్ళుగా జైలులోనే ఉంటున్నారు.



తన ఆశ్రమంలోని మేనేజర్, జర్నలిస్టు హత్యతో పాటు ఇద్దరు శిష్యురాళ్ళపై అత్యాచారం+హత్యారోపణలపై పోలీసులు డేరాబాబా మీద కేసు నమోదుచేశారు. కోర్టు విచారణలో బాబా చేసిన అకృత్యాలు నిరూపణయ్యాయి. దాంతో బాబా జైలు జీవితం గడుపుతున్నారు. పంజాబ్ లోని మాల్వా ప్రాంతం కేంద్రంగా బాబా రెండు రాష్ట్రాల్లోను కార్యక్రమాలను నడుపుతుండేవారు. కోట్లాదిమంది భక్తులను కలిగిన బాబాకు వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఉన్నాయి.



ఈయనకున్న భక్తుల కారణంగానే రాజకీయపార్టీలన్నీ ఈయనతో సన్నిహితంగా ఉండేవి. ఈయన ఎవరికి చెబితే వారికి ఓట్లేసే భక్తులున్నారు. ఇలాంటి నేపధ్యమున్న బాబా ఫిబ్రవరి 20వ తేదీన పోలింగ్ అంటే 7వ తేదీన బెయిల్ పై విడుదలవ్వటమంటే ఆశ్చర్యంగానే ఉంది. ఈయన విడుదలలో  బీజేపీ ప్రముఖుల హస్తం ఉందనే ప్రచారం పెరిగిపోతోంది. అయితే హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ మాట్లాడుతు పంజాబ్ లో ఎన్నికలకు, డేరాబాబా విడుదలకు ఎలాంటి సంబంధం లేదన్నారు.


మాల్వా ప్రాంతంలో డేరాబాబాకు అత్యధికసంఖ్యలో భక్తులున్నారు. ఈ ప్రాంతంలోనే పంజాబ్ లోని మొత్తం  117 సీట్లో 69 సీట్లున్నాయి. ఇక్కడ అందరికంటే ఎక్కువ సీట్లు సంపాదించిన పార్టీయే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంటుంది.  మరి బాబా విడుదల కారణంగా ఏ పార్టీపై దెబ్బ పడుతుందో అనే టెన్షన్ పార్టీల్లో మొదలైంది. ఆప్, కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు బీజేపీనే  డేరాబాబాను కావాలనే విడుదల చేయించిందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. లేకపోతే ఇంతకాలం బెయిల్ కోసం ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయినా డేరా సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఎలా బెయిల్ తెచ్చుకున్నారు ? అంటు పార్టీలు ఆరోపణలు మొదలుపెట్టాయి. మరి నిజమేమిటో బాబానే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: