గో బ్యాక్ చైనా.. షాకిచ్చిన ప్రజలు?

praveen
ఏ దేశంలో అయినా సరే ఇతర దేశాలు తమ అంతర్గత వ్యవహారాలు కలుగజేసుకోవటాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాయి. అటు నక్కజిత్తుల మరి చైనా మాత్రం ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో కలుగజేసుకోవటమే పని గా పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఎన్నో దేశాలు తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది చైనా. ఇక ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగానే అటు నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో చైనా కలుగ చేసుకోవడం చేసింది. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నేపాల్ కు భారీగా అప్పులు ఇచ్చి తన వైపుకు తిప్పుకుంది.



 దీంతో మిత్ర దేశమైన భారత్ ను నేపాల్ వ్యతిరేకించే  విధంగా వెనకుండి కుట్రలు నడిపింది. అంతేకాదు ఇక నేపాల్ లో ఉన్న పాలకులను కూడా తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది. చివరికి చైనా ప్లాన్ రివర్స్ అయింది. నేపాల్లో ప్రభుత్వం కుప్పకూలి పోయింది. ఇక ఇప్పుడు నేపాలీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చైనా ఓవరాక్షన్ మాత్రం తగ్గలేదు. ఇక ఇప్పుడు మితిమీరిన జోక్యం ప్రజలకు కూడా అస్సలు నచ్చడంలేదు. దీంతో చైనా తీరుకు నిరసనగా నేపాలి ప్రజలందరూ ఉద్యమాల బాట పడుతూ ఉండటం గమనార్హం.


 ఇటీవలి కాలంలో చైనా నేపాల్ లోని ఎన్నో ప్రాంతాల్లో తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకుని లోకల్ వ్యాపారులు అందరిని కూడా దెబ్బ తీస్తున్న నేపథ్యంలో రాష్ట్రీయ ఏకతా అభియాన్.. కబర్ హబ్ ప్రాంతాలలో చైనాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించడం మొదలు పెట్టారు. చైనా మితిమీరిన జోక్యం.. నేపాల్లోని సరిహద్దుల్లో కొన్ని భాగాలను ఆక్రమించుకోవడం ఖండిస్తున్నారూ నేపాలీ ప్రజలు. రోజుకొక  ప్రాంతంలో భారీగా నిరసన ప్రదర్శనలు జరుగుతుండడం గమనార్హం. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చిత్రపటాలను తగలబెడుతూ గోబ్యాక్ చైనా అంటూ నినాదాలు చేస్తున్నారు. అదే సమయంలో చైనా ఇంత చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోనట్లు ఉండటంపై మీడియా వేదికగా ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: