క‌రోనా : ఇక విదేశాల నుంచి వ‌చ్చేవారికి మార్గ ద‌ర్శ‌కాలు తెలుసా..?

N ANJANEYULU
ప్ర‌పంచ వ్యాప్తంగా ఓవైపు క‌రోనా కేసులు, మ‌రొక‌వైపు ఒమిక్రాన్ కేసులు ఉగ్ర‌రూపం దాల్చుతుండ‌టంతో భార‌త ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల‌కు న‌డుంబిగించిన‌ది. ముఖ్యంగా విదేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు అమ‌లులో ఉన్న మార్గద‌ర్శ‌కాల‌ను స‌వ‌రించి.. క‌రోనా కేసులు ప్ర‌మాద స్థాయిలో ఉన్న ఎట్‌రిస్క్ దేశాల‌తో పాటు ఇత‌ర దేశాల నుంచి భార‌త్‌కు వ‌చ్చే ప్ర‌యాణికులంద‌రూ వారం పాటు త‌ప్ప‌నిస‌రిగా హోం క్వారంటైన్‌లో ఉండాలంటూ శుక్ర‌వారం స‌వ‌రించిన మార్గ‌ద‌ర్శ‌కాలను విడుద‌ల చేసింది.  

 జ‌న‌వ‌రి 11నుండి నూత‌న నిబంధ‌న‌లు అమ‌లులోకి వ‌స్తాయి అని త‌దుప‌రి ఆదేశాలు అందేవ‌ర‌కు అమ‌లులో ఉంటాయి అని స్ప‌ష్టం చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. ముఖ్యంగా ఇటలీ నుండి అమృత్‌స‌ర్‌కు వ‌చ్చిన ఎయిర్ ఇండియా విమానంలో 125 మందికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో  ఈ నిబంధ‌న విధించింది. ప్ర‌యాణికులు త‌మ వివ‌రాల‌ను 14 రోజుల కింద‌టి వ‌ర‌కు చేసిన ప్ర‌యాణాల‌ను సువిధ పోర్ట‌ల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్ర‌యాణానికి 72 గంట‌ల ముందు ఆర్‌టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు రావాలి. ముఖ్యంగా విదేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికులంద‌రూ విమానాశ్ర‌యంలో దిగిన వెంట‌నే క‌రోనా ప‌రీక్ష చేయించుకోవాలి. ఫ‌లితం వ‌చ్చిన త‌రువాత‌నే బ‌య‌ట‌కు వెళ్లాలి. ఈ ప‌రీక్ష కోసం ముందుగానే సువిధ పోర్ట‌ల్‌లో బుక్ చేసుకోవ‌చ్చు.

క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్ వ‌స్తే ఐసోలేష‌న్‌కు పంపిస్తారు. ఒక‌వేళ నెగెటివ్ వ‌చ్చిన‌ట్ట‌యితే వారం రోజుల పాటు క్వారంటైన్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. 8వ రోజు ఆర్‌టీపీసీఆర్ ప‌రీక్ష చేయించుకుని రిపోర్ట్ వివిధ వెబ్‌పోర్ట‌ల్‌లో ఆప్‌లోడ్ చేయాలి. ఆ ప‌రీక్ష‌లో నెగెటివ్ వ‌స్తే మ‌రొక వారం పాటు ఆరోగ్యాన్ని స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించుకోవాలి. అదేవిధంగా ఎట్‌రిస్క్ కానీ దేశాల నుంచి వ‌చ్చిన వారు అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల్లో 2 శాతం మంది కూడా విమాన‌శ్ర‌యంలో రాండ‌మ్ ప‌రీక్ష‌లు చేయించుకుని నెగెటివ్ వ‌చ్చినా హోంక్వారంటైన్ ఉండాలి. ఐదేళ్ల‌లోపు చిన్నారుల‌కు ప‌రీక్ష‌ల నుంచి మిన‌హాయింపు ఉంటుంది. ఒమిక్రాన్ కేసులు ప్ర‌మాద‌క‌రంగా విజృంభిస్తున్న ఎట్‌రిస్క్ దేశాల జాబితాలో మ‌రికొన్నింటిని చేర్చింది. యూకే స‌హా అన్ని యూర‌ఫ్ దేశాలు ద‌క్షిణాఫ్రికా, బ్రెజిల్‌, జోట్స్‌వానా, చైనా, ఘ‌నా, మారిష‌స్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌, కాంగ్, ఇథియోపియా, క‌జ‌కిస్తాన్‌, కెన్యా, నైజీరియా, ట్యునిషియా, జాంబియా వంటి దేశాలున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: