ఢిల్లీ : మోడి భద్రతా వైఫల్యంలో తప్పంతా వీళ్ళదేనా ?

Vijaya


రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోడి పంజాబ్ పర్యటనలో బయటపడిన భద్రతా వైఫల్యంపై యావత్ దేశం చర్చ జరుగుతోంది. భద్రతా వైఫల్యానికి మీరే కారణమంటే కాదు మీరే కారణమంటు కేంద్ర-రాష్ట్రప్రభుత్వాలు ఒకదానిపై మరకొటి నెట్టేసుకుంటున్నాయి. భద్రతా వైఫల్యం సంగతిని పక్కన పెట్టేసి బాధ్యత విషయంలో గొడవలు పడటమే చాలా చీపుగా ఉంది. నిజానికి భద్రతా వైఫల్యం ఏ ఒక్కరిదీ కాదు. ఇందులో రెండు ప్రభుత్వాలదీ సమాన బాధ్యతుంది.



ప్రధానమంత్రి భద్రత నియమావళిని బ్లూబుక్ అంటారు. ఈ బ్లూబుక్ ప్రకారం ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో పర్యటిస్తే ఆయనకు పూర్తి భద్రతను కల్పించాల్సిన బాధ్యత ఆ రాష్ట్రప్రభుత్వానిదే. ఇదే సమయంలో ప్రధాని వ్యక్తిగత భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ ఉన్నతాధికారులు కూడా నిరంతరం రాష్ట్రప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలి. ప్రధాని పర్యటన ఫైనల్ అయిన దగ్గర నుండి  పర్యటన ముగిసేవరకు మొత్తం భద్రతా పర్యవేక్షణంతా ఎస్పీజీదే.



రాష్ట్ర డీజీపీ అయినా చీఫ్ సెక్రటరీ అయినా ఎస్పీజీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సిందే. ప్రధాని పర్యటనలో ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ముందే సిద్ధం చేస్తారు. కానీ ఇక్కడ జరిగిందేమంటే హెలికాప్టర్ ప్రయాణానికి బదులు రోడ్డు మార్గాన్ని ఎంపికచేశారు. రోడ్డు మార్గంలో ప్రధానిని తీసుకెళ్ళాలని నిర్ణయించటం ఎస్పీజీ తప్పు. ఎందుకంటే ఎయిర్ పోర్టు నుండి   ప్రధానమంత్రి పాల్గొనాల్సిన కార్యక్రమం వేదిక 111 కిలోమీటర్లుంది. ప్రధానిని 111 కిలోమీటర్లను రోడ్డులో తీసుకెళ్ళాలని నిర్టయించటమే ఎస్పీజీ చేసిన తప్పు. ఏ ప్రధాని కూడా ఇన్ని కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించరు.



అలాగే ఫ్లైఓవర్ మీద వాహనాలను ఆందోళనకారులు అడ్డుగా పెట్టారని తెలియగానే వెంటనే మోడీని అక్కడి నుండి వేరే మార్గంలో వెనక్కు తీసుకెళ్ళిపోవాలి. కానీ ఎస్పీజీ అలా చేయకుండా 20 నిముషాలు ఫ్లైఓవర్ పైనే ఉంచేసింది.  అంటే టెర్రరిస్టులు టార్గెట్ చేసేందుకు వీలుగా ప్రధానిని ఎక్స్ పోజ్ చేసింది ఎస్పీజీనే. ఏమీ జరగలేదు కాబట్టి ప్రధాని అదృష్టవంతుడనే చెప్పాలి. ఇక ప్రధాని ప్రయాణించిన వెహికల్ కూడా టెర్రరిస్టులు ఐఈడీ లేదా రాకెట్ లాంఛర్ తో ఈజీగా కొట్టగలిగిన వాహనాన్నే వాడారట.



పంజాబ్ పర్యటనలో ప్రధాని ప్రయాణించింది ఫార్చూనర్ వెహికల్. ఇది బుల్లెట్ ప్రూఫే కానీ రాకెట్ లాంచర్, ఐఈడీని తట్టుకునేంత శక్తిలేదట. రోడ్డుమీద వాహనాలను అనుమతించటం కూడా ఎస్పీజీ తప్పే అని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గం రెడీ చేసేంత సమయం కూడా ఎస్పీజీ రాష్ట్రప్రభుత్వానికి ఇవ్వలేదు. వాతావరణం అనుకూలంగా లేదనుకున్నపుడు 111 కిలోమీటర్లను రోడ్డు ద్వారా మాత్రమే ప్రయాణించాలంటే అప్పుడు ఎస్పీజీ అసలు ప్రోగ్రామ్ నే రద్దు చేసుండాలి. అలా చేసుంటే ఇపుడీ సమస్య వచ్చేదే కాదు. సరే ఇదికూడా మంచికే జరిగింది. ఎలాగంటే భద్రతా వైఫల్యాలు బయటపడ్డాయి. కాబట్టి వైఫల్యానికి బాధ్యత మీదంటే కాదు మీదనే తోసుకునే బదులు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటే దేశానికి మంచిది




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: