పవన్‌ తో పొత్తుపై చంద్రబాబు సంచలన ప్రకటన !

Veldandi Saikiran
చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన  చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులు రాష్ట్ర పరిస్థితుల బట్టీ ఏర్పాడుతుంటాయని.. వైకాపా వాళ్ళు కోత్త బిక్షగాళ్ళు .. కోత్త బిక్షగాళ్ళు చరిత్ర తెలియదని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు చంద్రబాబు.. పోత్తులు లేకుండా గెలిచాము...పోత్తులతో గెలిచాము...  పోత్తులతో ఓడిపోయినా సందర్భం ఉందన్నారు చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట పరిస్థితి దృష్యా అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. ఒక్క ఛాన్స్ అడిగారు ఇచ్చారు... రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు చంద్రబాబు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమం పనులు చేశాము.. వైకాపా నేతలకు ప్రజలు త్వరలో చెవులు పూలు పెట్టే రోజులు వస్తాయని పేర్కొన్నారు చంద్రబాబు. ముఖ్య మంత్రి జగన్ ఒక విధ్వంసకారీ....  తమిళనాడులో అమ్మ క్యాంటిన్ ఉంది... అన్న క్యాంటిన్ ఎందుకు తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు...


 ప్రజల్లో వైకాపాపై తీవ్ర వ్యతిరేకత ఉంది... రాష్ట్రం జగన్ జాగీరు కాదని మండిపడ్డారు చంద్రబాబు....  కోవిడ్ వల్ల ఎపి ఆదాయం తగ్గలేదు... జగన్ పరిపాలనా చేయకపోవడం వల్ల ఆదాయం తగ్గిందన్నారు చంద్రబాబు. జగన్ తీరుతో వైకాపా శ్రేణులు బాదితులుగా ఉన్నారు... పుంగనూరు ఎలా పెద్దిరెడ్డి గెలుస్తాడు చూస్తానని హెచ్చరించారు చంద్రబాబు. కుప్పంతో ఎప్పుడూ ఎమోషన్ ఎటాచ్ మెంట్ ఉంటుందని ప్రశ్నించారు చంద్రబాబు...కుప్పం లో టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసి పెడుతున్నా ...అందరి లెక్కలు తేల్చుతామన్నారు. రెండు ఘటనలు కుప్పం లో నన్ను బాధించాయి.. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు నన్ను బాధపెట్టాయన్నారు.  కుప్పం లో డబ్బులు పంచే తీరు ఎప్పుడూ లేదని... వెయ్యి, రెండు వేల పంచి ఓట్లు అడిగే పార్టీ కాదు టీడీపీ అని చెప్పారు. కుప్పం లో ఓటమి అంటూ నన్ను ఎగతాళి చేస్తే....మిమ్మల్ని అన్నట్లు కాదా! మనం కూడా ప్రలోభాలకు లొంగిపోతే ఎలా? అని ప్రశ్నించారు.  మనం బాగా పనిచేయాలి....కుప్పం లో కోవర్ట్ లను పంపేస్తా...ప్రక్షాళన చేస్తానని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: