రెండో రోజు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు సమావేశం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డీపీఆర్ తయారీ అంశంపై చర్చ జరిగింది. విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని తెలిపిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ...సముద్ర తీరాన్ని ఆనుకుని బీచ్కారిడర్ ప్రాజెక్టులకు సమీపనుంచి ఈ రోడ్డు వెళ్తుందని తెలిపారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతం లో పర్యాటకరంగం అభివృద్ధి కి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత దోహపడుతుందని తెలిపిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ... విశాఖ నగరంలో వాహనరద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారిని పేర్కొన్నారు. విజవాడ తూర్పు బైపాస్‌పై గతంలో చేసిన విజ్ఞప్తిని చురుగ్గా పరిశీలించాలని కోరిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ... సంబంధిత శాఖల సమన్వయంతో భూ సేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేస్తామన్నారు. ప్రాజెక్టు ఖర్చు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఎస్జీఎస్టీ, రాయల్టీ మినహాయింపులిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ... వీలైనంత త్వరగా ప్రాజెక్టు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కత్తిపూడి – ఒంగోలు కారిడర్లో భాగంగా ఎన్‌హెచ్–216 నిర్మాణానికి సంబంధించి బాపట్లలో 4 లేన్ల రోడ్డు గా విస్తరించాలని కోరిన సీఎం... విద్యాసంస్థలు, పర్యాటకులు, ఎయిర్‌బేస్ కారణంగా మళ్లీ ట్రాఫిక్‌జామ్స్ ఏర్పడే అవకాశం ఉందని, ప్రస్తుతం బాపట్ల ద్వారా వెళ్తున్న రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలంటూ విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.