ఆ విషయం కూడా మగాళ్లే నిర్ణయిస్తారా.. మహిళా ఎంపీ కామెంట్స్?

praveen
మొన్నటి వరకూ ఆడ పిల్లలకు కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలుగా ఉండేది. ఇక ఈ కనీస వివాహ వయస్సు కారణంగా ఎంతోమంది ఆడపిల్లలు చదువులు పూర్తి చేయలేక పోతున్నారని తద్వారా జీవితంలో వెనకబడి పోతున్నారు అని భావించిన కేంద్ర ప్రభుత్వం ఇక ఆడ పిల్లలకు కనీస వివాహ వయస్సు 21 సంవత్సరాలు గా మారుస్తూ చట్టంలో మార్పులు తీసుకువచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనం గానే మారిపోయింది అని చెప్పాలి. ఇక మహిళల కనీస వివాహ వయస్సు 21 సంవత్సరాలకు మార్చడంపై కొంతమంది హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం మహిళల అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడుతుంది అంటూ చెప్పారు.



 ఇక ఈ నిర్ణయం కారణంగా వివాహ వయసు వచ్చే లోపే మహిళలు చదువు పూర్తి చేసి ఉంటారని తద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు అవకాశం ఉంటుందని ప్రశంసలు కురిపించారు. అదేసమయంలో కొంతమంది కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు. 18 సంవత్సరాలు వచ్చాక ఓటు వేసే హక్కు ఉన్నప్పుడు పెళ్ళి చేసుకునే హక్కు ఎందుకు ఉండదు అంటూ ప్రశ్నించారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అమ్మాయిల కనీస వివాహ 21 ఏళ్ల కు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పై అధ్యయనం చేయడానికి స్టాండింగ్ కమిటీ నియమించారు. ప్రస్తుతం ఈ కమిటీ అధ్యయనం కూడా మొదలు పెట్టింది.



 అయితే మహిళ వివాహ వయసు గురించి అధ్యయనం కోసం నియమించిన స్టాండింగ్ కమిటీ లో కేవలం ఒకే ఒక మహిళ మాత్రమే ఉండడం పై ప్రస్తుతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇదే విషయంపై స్పందిస్తూ విమర్శలు గుప్పించారు డీఎంకే ఎంపీ కనిమొళి. పార్లమెంటులో 110 మంది మహిళా ఎంపీలు ఉన్నప్పటికీ ఈ బిల్లు అధ్యయనం కోసం 30 మంది పురుషులు కేవలం ఒకే ఒక మహిళలను నియమించడం దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఎలాంటి హక్కులు ఉండాలి.. మహిళల వివాహ వయస్సు ఎంత అన్నది కూడా పురుషులే నిర్ణయిస్తారా అంటూ సూటి ప్రశ్న వేశారు ఎంపీ కనిమొళి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: