పాక్ కి ఇంకా బుద్ధి రాలేదు.. మళ్ళీ చైనాతో ఆ పని?

praveen
పాకిస్తాన్ చైనా ల మధ్య ఏర్పడిన బంధం రోజురోజుకు పాకిస్తాన్ ప్రజలకు ప్రమాదకరంగానే మారిపోతుంది అని చెప్పాలి. ఒకవైపు పాకిస్థాన్ తమకు మిత్రదేశం అని చెప్పుకుంటున్న చైనా అటు పాకిస్థాన్ లో ఉన్న సహజ వనరులు మాత్రం ఖాళీ చేయడమే లక్ష్యంగా ఎన్నో కుట్రలు పన్నుతోంది. ఇప్పటికే ఆర్థిక సహాయం పేరుతో అటు పాకిస్థాన్ లో చెప్పు చేతుల్లో పెట్టుకుంది చైనా. ఈ క్రమంలోనే చైనా పాకిస్తాన్లో ఉన్న సహజ వనరులన్నింటినీ కూడా అక్రమంగా తరలిస్తూ ఉన్నప్పటికీ పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. అదే సమయంలో చైనా సైన్యం పాకిస్థాన్ లో ఎన్నో అరాచకాలు సృష్టిస్తూ ఉన్నప్పటికీ అటు దేశ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది పాకిస్థాన్ ప్రభుత్వం.


 ఈ క్రమంలోనే కొన్ని రోజుల పాటు చైనా పాకిస్తాన్ మధ్య సంబంధాలు కొనసాగితే ఇక మరింత సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉందని భావించిన ఎంతో మంది ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉద్యమాలు చేపడుతూ  ఉండటం గమనార్హం. ముఖ్యంగా గ్వాదర్ పోర్టులో పాకిస్తాన్ సహజవనరులను అటు చైనా ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో ప్రజలందరూ ఉద్యమాల బాట పడుతున్నప్పటికీ అటు పాకిస్థాన్ ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రాలేదు అని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల చైనాతో సంబంధాలు మరింత మెరుగుపరుచుకునేందుకు పాకిస్థాన్ కీలక ముందడుగు వేసినట్లు తెలుస్తోంది.

 ఈ క్రమంలోనే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనే విధంగానే పాకిస్తాన్ వ్యవహరిస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు. గ్వాదర్ పోర్ట్ ను లింక్ అప్ చేసేటటువంటి సిపెక్ ఏకానమిక్ కారిడార్ ప్రాజెక్టును కొనసాగించ బోతున్నట్లు ఇటీవల చైనా ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు గ్వాదర్ పోర్ట్ నుంచి సంపద  దూసుకు పోతూ ఉండడం  స్థానికులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో ప్రజలు తిరుగుబాటు చేస్తుండగా.. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ ప్రభుత్వం తీరులో మార్పు రాకపోవడంతో ఆయుధాలతో పోరాటానికి కూడా సిద్ధం అంటూ ప్రజలు హెచ్చరికలు జారీ చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: