తాడేపల్లి : మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ప్రారంభించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. నవ రత్నాల వల్ల ప్రయోజనాలు తెలిపేందుకు ప్రచార రథం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సంక్షేమపథకాల వల్ల పేదలు తమ కాళ్ల పై తాము నిలబడగలుగుతున్నారని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. పేదలు మరింత ఎక్కువగా సంక్షేమ పథకాలు వినియోగించుకునేెదుకు ఇలాంటి ప్రచారం అవసరమని వెల్లడించారు సజ్జల రామకృష్ణారెడ్డి.
పథకాల వల్ల పేదల్లో వస్తోన్న మార్పులు తెలుసుకోలేని వారు ఇంకా లక్షలాది మంది ఉన్నారని.. ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలపై విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. విపక్షాల విషప్రచారాన్ని కొందరు నిజమేనని నమ్ముతున్నారని.. ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నది ఓట్ల కోసం కాదని వెల్లడించారు సజ్జల రామకృష్ణారెడ్డి. పేదలకు శాచురేషన్ పద్దతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. పథకాలు అందని వారి కోసం నిన్నే 700 కోట్లు వెచ్చించి ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. నిరు పేదల ఇళ్లను వారికి సొంతం చేసేందుకే వన్ టైం సెటిల్ మెంట్ ను ప్రభుత్వం అమలు చేస్తోందని.. వన్ టైం సెటిల్ మెంట్ పై విషం కక్కుతూ విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ప్రచారంలో విపక్షాలు ఒకింత విజయం సాధిస్తున్నాయని.. ఓటీఎస్ ప్రయోజనాల పై మౌత్ పబ్లిసిటీ ప్రతి ఊర్లో విస్తృతంగా జరగాలన్నారు. ఓటీఎస్ పై లబ్ది పొందిన వారు వారంతట వారు బయటకు వచ్చి ప్రచారం చేయాలని.. చైతన్య రథాలు తిప్పి అందరినీ చైతన్య పరచాలని డిమాండ్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.