ఒమిక్రాన్ కు విరుగుడు... ప్రజలకు ఊరట ఇదే?
కొన్ని లక్షణాలు, మార్పులను బట్టి ఈ వేరియంట్ ను గుర్తించడం జరుగుతోంది.
అయితే ఎప్పుడైతే వ్యాధిని కచ్చితంగా నిర్ధారించలేమో అప్పుడే అందుకు తగ్గ చికిత్స అందజేసి బాధితుడిని రక్షించే ప్రయత్నం పూర్తిగా చేయగలము. కాగా ఇపుడు ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కాస్త ఊరట కలిగించే కబురు వచ్చింది. అదేమిటంటే....ఒమిక్రాన్ కు అవసరమయ్యే కిట్ లను దిబ్రుగఢ్ లోని ఐసీఎమ్ఆర్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. దీనిపై మేదో పరమైన, వాణిజ్య పరమైన సర్వ హక్కులు కూడా తమకు మాత్రమే ఉంటాయని ఐసీఎమ్ఆర్ అధికారికంగా తెలుపుతూ స్పష్టం చేసింది.
ఎవరైతే తమతో ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుంటారో వారికి మాత్రము కిట్ ను తయారు చేసే ప్రొసీజర్ ను వివరిస్తామని, అలాగే తయారు చేసిన కిట్లను విక్రయించుకునే అధికారాన్ని ఇస్తామని ఖచ్చితమైన క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనా దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ వార్త కాస్త ఊరట కలిగిస్తోంది. అయితే ఇది అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చి ప్రజలలో ఇప్పటికే ఉన్న ఆందోళనను తొలగించాలి అని కోరుకుందాం.