బాబు పాలిటిక్స్ : ఏపీలో నారా భువనేశ్వరి పర్యటన ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్గా కొనసాగుతూనే ఉంటాయి అన్న సంగతి మనందరికీ విధితమే. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎపిసోడ్ నేపథ్యంలో కంటతడి పెట్టుకున్న అంతరం... ఆంధ్ర రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ లో అటు అధికార పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి, సీనియర్ ఎన్టీఆర్ ముద్దుల కూతురు నారా భువనేశ్వరి. 

రేపు శ్రీవారి సన్నిధి అయిన తిరుపతి పట్టణంలో పర్యటన చేయనున్నారు నారా భువనేశ్వరి మేడం. ఈ సందర్భంగా వరదబాధితులకు ఆర్థిక సహాయం చేయనున్నారు భువనేశ్వరి గారు. ముఖ్యంగా వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం.. ఎన్టీ రామారావు మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఒక్కో బాధిత కుటుంబానికి ఏకంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు నారా భువనేశ్వరి గారు. అలాగే ఎన్టీఆర్ మెమోరియల్.. ట్రస్టు ద్వారా కొంత మందికి నిత్యవసర వస్తువులు కూడా అం దిం చ ను న్నా రు నా రా భువ నే శ్వ రి   గా రు . ఈ ప ర్య ట నలో  ఏకం గా 48  వరద బాధిత కుటుంబాల కు నా రా భువ నేశ్వరి ఆర్థి క సహాయం చేయనున్నా రు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో గత 20 రోజుల కిందట భారీ నుంచి అతి భారీ వర్షాలు అన్న సంగతి మనందరికీ విధితమే. ఈ భారీ వర్షాల కారణంగా రాయలసీమ ప్రాంతాల ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలా మంది నిరాశ్రయులు కూడా అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహా విపక్షాలు కూడా బాధితులకు ఆర్థిక సహాయం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: