గుంతకల్లులో సైకిల్ స్పీడ్ పెరగడం లేదుగా...!

VUYYURU SUBHASH
అనంతపురం జిల్లా అంటే టీడీపీ కంచుకోట అని అందరికీ గుర్తొస్తుంది. ఈ జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. కానీ గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో ఈ కంచుకోటలు అన్నీ బద్దలు అయ్యాయి. వైసీపీ పూర్తిగా ఆధిక్యం సాధించింది. కానీ మళ్ళీ వెంటనే వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా పికప్ అయిపోతుంది. ఈ రెండున్నర ఏళ్ల సమయంలో చాలావరకు వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేలా టీడీపీ బలోపేతం అవుతుంది.

కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకోవాల్సిన అవసరముంది. ఇంకా పలు నియోజకవర్గాల్లో పార్టీ పికప్ అవ్వాలి. అలా టీడీపీ పికప్ అవ్వాల్సిన నియోజకవర్గాల్లో గుంతకల్ కూడా ఒకటి. మామూలుగా గుంతకల్లులో టీడీపీ మంచి విజయాలు ఏమి సాధించలేదు. ఇది గుత్తి నియోజకవర్గంగా ఉన్నప్పుడు టీడీపీ మూడుసార్లు గెలిచింది. ఆ తర్వాత గుంతకల్లుగా మారక ఒకసారి గెలిచింది. అది కూడా 2014 ఎన్నికల్లోనే. 2019లో మాత్రం వైసీపీ భారీ మెజారిటీతో గెలిచింది.

దాదాపు 48 వేల ఓట్ల మెజారిటీతో వై. వెంకట్రామి రెడ్డి విజయం సాధించారు. ఇలా భారీ మెజారిటీతో గెలిచిన వెంకట్రామి రెడ్డి...ఈ రెండున్నర ఏళ్లలో పెద్దగా వ్యతిరేకత ఏమి తెచ్చుకోలేదు. కాకపోతే సొంత పార్టీ వాళ్ళకే పనిచేస్తారనే విమర్శలు వచ్చాయి. అలాగే ఈయన కింద పనిచేసే నాయకులు కాస్త అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇవి కాస్త ఆయనకు మైనస్.. అలా అని వైసీపీకి పూర్తి నెగిటివ్  లేదు. అయితే ఆ పార్టీకి మ‌రీ అంత సానుకూ ల వాతావ‌ర ణం కూడా లేదు.

ఇక్కడ టీడీపీ నేత జితేంద్ర గౌడ్ పనిచేస్తున్నారు. ఈయన ఇంకా పికప్ అవ్వాల్సిన అవసరముంది. ఇప్పటికే టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీని వల్ల పార్టీ వీక్ గా ఉంది. వారిని మళ్ళీ టీడీపీలోకి తీసుకొచ్చి..కార్యకర్తలని కలుపుకునిపోతే జితేంద్రకు ప్లస్ అవుతుంది. లేదంటే గుంతకల్లులో టీడీపీకి మళ్ళీ దెబ్బపడేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: