భారత్ మొదటి సారి ఎగుమతి.. మోడీ సక్సెస్?

praveen
ఒకప్పుడు భారత్ను వెనుకబడిన దేశంగా అగ్రరాజ్యాలు చులకనగా చూసేవి. కానీ ఇటీవలి కాలంలో భారత్ ఎదుగుతున్న తీరు చూసి అగ్ర రాజ్యాలు సైతం ఆశ్చర్యపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా సంచలనం గానే మారిపోతుంది.. ఈ క్రమంలో ఇప్పటికే మేకిన్ ఇండియా లో భాగంగా మోదీ సర్కార్ అన్ని రకాల వస్తువులను కూడా ఇండియాలోనే తయారు చేసే విధంగా ముందడుగు వేస్తుంది. ఎలక్ట్రికల్ వస్తువుల దగ్గర నుంచి ప్రస్తుతం యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు వరకు కూడా మేకిన్ ఇండియా లో భాగంగా తయారు చేస్తూ ఉండటం గమనార్హం.

 ఇలా ఒకప్పుడు ఇతర దేశాల నుంచి ప్రతి వస్తువును దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇతర దేశాలకు వస్తువులను ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదుగుతుంది అని చెప్పాలి. ఇలా క్రమక్రమంగా భారత్ ఎదుగుతున్న తీరు ప్రపంచ దేశాలను నివ్వెరపోయేలా చేస్తోంది. ఒకప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే ఉండేది. జపాన్,అమెరికా, స్విజర్లాండ్, సింగపూర్, దుబాయ్, చైనా లాంటి దేశాల నుంచి ఎలక్ట్రికల్ వస్తువులను దిగుమతి చేసుకుంటూ ఉండేది భారత్.

 కానీ ఇప్పుడు మేకిన్ ఇండియా లో భాగంగా విదేశీ సంస్థలు భారత్లో కి వచ్చి పెట్టుబడులు పెట్టి ఇక్కడ వస్తువులను ఉత్పత్తి చేసే విధంగా ఆకర్షిస్తుంది భారత్. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ఇతర దేశాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులను దిగుమతి చేసుకోవడం కాదు ఎగుమతులు కూడా భారత్లో ప్రారంభం కావడం శుభ పరిణామంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. 82 కోట్ల విలువైనటు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఇటీవలే భారత్ ఎగుమతి చేసింది. ఇక రానున్న రోజుల్లో భారత్ లో మరింతగా ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతి పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: