బాబోరి రేవంత్ : ఏజెంట్ కేసీఆర్?

RATNA KISHORE
తెలంగాణలో కేసీఆర్ చెప్పిందే వేదం
అదేవిధంగా కేసీఆర్ చెప్పిందే రేవంత్ కూ వేదం
అందుకే టీపీసీసీలో ఎదుగుద‌ల లేదు
పార్టీకి తెలంగాణ‌లో చోటే లేదు అన్న‌ది ఓ విమ‌ర్శ
విన‌వ‌స్తూ ఉంది...............................................


తెలంగాణ‌లో ఇంటి పార్టీ టీఆర్ఎస్ ను భూ స్థాపితం చేస్తామ‌ని, కాంగ్రెస్ కు పూర్వ వైభ‌వం తెస్తామ‌ని మాట‌లు చెప్పే లీడ‌ర్ రేవంత్ ఆ స్థాయిలో క‌సితీరా కృషి చేయ‌డం లేదు అన్న‌ది ఓ వాస్త‌వం. అంద‌రి క‌న్నా వేగంగానే పార్టీలో అంద‌లం ఎక్కిన రేవంత్ దానిని నిలుపుకునేందుకు చేసే ఏ ప్ర‌య‌త్న‌మూ స‌ఫ‌లీకృతం కావ‌డం లేదు. పార్టీ క‌న్నా రాహుల్  గాంధీనే ఎక్కువ‌గా రేవంత్ ను న‌మ్మారు. కానీ ఆయ‌న న‌మ్మ‌కాన్ని కూడా నిలిపే స్థాయిలో ఇవాళ ఆయ‌న లేరు. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు రేవంత్ ప్ర‌వ‌ర్త‌నా స‌రళి పై అధినాయ‌క‌త్వం ఆరా తీస్తూనే ఉంది.
గ్రేటర్ హైద్రాబాద్ తో స‌హా ఇత‌ర ప్రాంతాల‌లో విస్తృతంగా ప‌ర్య‌టించి పార్టీ అప్ప‌గించిన ప‌నిని పూర్తి చేయాల్సి ఉన్నా అవేవీ లేకుండానే కాలం వెళ్ల‌దీస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఆయ‌న ఎదుర్కొంటున్నారు. క్షేత్ర స్థాయిలో  కమిటీలు  పునః వ్య‌వ‌స్థీక‌రించాల్సిన అవ‌స‌రం ఉన్నా కూడా ఆ ప‌ని మాత్రం ఆయ‌న చేయ‌డం లేదు. కొన్ని మీడియా స‌మావేశాల్లో మాత్రం అతి ఆవేశం ప్ర‌ద‌ర్శించి త‌రువాత నిశ్శ‌బ్దం అయిపోతున్నారు రేవంత్. ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న పార్టీకి ఎందుకూ ప‌నికిరాదు. నిరంత‌రం  ప్ర‌జ‌ల మ‌ధ్యన ఉంటేనే గెలుపో ఓట‌మో ఏదో ఒక‌టి తేలిపోతుంది. కానీ రేవంత్ ఇందుకు భిన్నంగా త‌న న‌డ‌వ‌డి సాగిస్తున్నారు.
మ‌నిషి ఎలా ఉన్నా స‌రే పార్టీ అప్ప‌గించిన ప‌నిలో నిమ‌గ్నం అయి ఉండాలి. మ‌నిషి ఎలా త‌న ప‌రిస్థితుల‌ను మార్చుకుంటాడో అలానే పార్టీ ప‌రిస్థితులనూ, సంబంధిత ప‌రిణామాల‌నూ మార్చేందుకు సిద్ధంగా ఉండాలి. తెలంగాణ వాకిట రేవంత్ చేయాల్సిందే ఇది. కానీ ఆయ‌న ఇది త‌ప్ప అన్నీ చేస్తున్నారు. టీపీసీసీ బాస్ రేవంత్ కు ఇప్పుడు అన్నీ వ్య‌తిరేక ప‌వ‌నాలే! ఎందుకంటే ఆయ‌న ప‌ట్టించుకున్నా ప‌ట్టించుకోక‌పోయినా స‌రే హుజురాబాద్ లో బల‌హీన అభ్య‌ర్థిని నిలిపి పోటీకి మునుపే అస్త్ర సన్యాసం చేశారు. పోనీ మిగ‌తా ప్రాంతాల‌లో పార్టీపై ప‌ట్టు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా అంటే అదీ లేదు. ప‌ద‌వి చేప‌ట్ట‌గానే కేసీఆర్ ను తిట్ట‌డం కూడా ఓ రాజ‌కీయ ప‌న్నాగంలోనో వ్యూహంలోనో భాగ‌మే త‌ప్ప మ‌రొక‌టి కాదు. దీంతో రేవంత్ ను మొద‌టి నుంచి వైఎస్ వ‌ర్గం వ్య‌తిరేకిస్తూనే ఉంది. కోమ‌టి రెడ్డి లాంటివారికి రేవంత్ కు అంత పెద్ద ప‌ద‌వి అప్ప‌గించ‌డం ఏ మాత్రం ఇష్టం లేదు. ఒక్క ఆయ‌న‌కే కాదు చాలా మంది సీనియ‌ర్లంటే ఇప్ప‌టికీ రేవంత్ కు గౌర‌వం లేదు అని ఎప్పుడో తేలిపోయింది. దీంతో వీహెచ్ లాంటి నేత‌ల‌కూ రేవంత్ పార్టీలోకి వ‌చ్చిన సంద‌ర్భంలో కానీ ఇంత పెద్ద ప‌ద‌వి అధిష్టానం అప్ప‌గించిన‌ప్పుడు కానీ ఇసుమంత కూడా ఇష్టం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: