ప్రేమంటే ఇదేరా.. వీరిది పవిత్ర ప్రేమ బంధం?

praveen
ప్రేమ అనేది నేటి రోజుల్లో ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది అని చెప్పాలి. కేవలం అవసరాల కోసం మాత్రమే ప్రేమిస్తూ అవసరాలు తీరిన తర్వాత నడిరోడ్డు మీద వదిలేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది ఆర్థిక అవసరాల కోసం ప్రేమిస్తే ఇంకొంతమంది శారీరక అవసరాల కోసం ప్రేమ నటిస్తున్నారు. ఇలా అవసరాల కోసం పుట్టే ప్రేమలు తప్ప నిజాయితీగల ప్రేమ లు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఇక ఇప్పట్లో రెండు మనసుల మధ్య పుట్టిన ప్రేమ ఎక్కడైనా కనిపిస్తుందా అని అనుకుంటున్న సమయంలో కొన్ని కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తూ ఎంతో మంది హృదయాలను గెలుచుకుంటు ఉన్నాయి .

 ఇక్కడ ఇలాంటి ఒక ప్రేమ జంట స్టోరీ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. చిన్నచిన్న కారణాలు చెప్పి ప్రేమకు స్వస్తి పలికే వాళ్లను నేటి రోజుల్లో అడుగడుగున చూస్తున్నాం. కానీ ఇక్కడ మాత్రం ప్రేమకు కావాల్సింది కారణం కాదు  అన్న విషయాన్ని ఇక్కడ ఒక జంట నిరూపించింది. ఏకంగా అమ్మాయి దివ్యాంగురాలు అయినప్పటికీ కాళ్లతో నడవలేని సమస్యతో బాధపడుతున్నప్పటికీ ఆ ఆ యువకుడికి మాత్రం ఆ యువతి దేవకన్య లాగే కనిపించింది. యువకుడి ప్రేమ ముందు లోకం మొత్తం దాసోహం అయింది అని చెప్పాలి.

 నడవలేని దివ్యాంగురాలిని ప్రేమించిన యువకుడు పెద్దలు వద్దన్న వెనకడుగు వేయకుండా యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి పీటల వరకు నడవలేని స్థితిలో ఉన్న ఆ యువతిని తన చేతులతో ఎత్తుకెళ్లి పెళ్లి పీటలపై కూర్చోబెట్టాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది  ఈ ఘటన. వసంతరావు అనే 22 ఏళ్ల యువకుడు మణుగూరు కు చెందిన దివ్యాంగురాలు నరసమ్మ ను ప్రేమించాడు. ఓ వివాహ వేడుకలో నరసమ్మను చూసినా వసంతరావు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్య మాటలు కలిసీ వీరిద్దరి మనసులు అల్లుకున్నాయి. వివాహ బంధంతో ఒక్కటి అవ్వాలి అని అనుకున్నారు. తల్లిదండ్రులు సోదరులు వద్దు ఎంత చెప్పినా నరసమ్మను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు.  ఇటీవలే దేవాలయంలో వీరికి ఆదర్శ వివాహం జరిగింది. వివాహ వేదిక వద్దకు వధువును వరుడు ఎంతో ప్రేమగా వధువుని ఎత్తుకొని రావడం అందరి మనసు దోచేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: