అమెరికా ఆయుధాలు ఉగ్రవాదుల చేతికి.. భారత్ కి ప్రమాదం?
ఈ ప్రకటనతో అప్పటివరకు అజ్ఞాతంలో ఉన్న తాలిబాన్లు మరోసారి ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు అరాచకాలు సృష్టిస్తూన్నా ఆటో అమెరికా సైన్యం మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరించింది. అయితే రెండు దశాబ్దాల నుంచి ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యం పటిష్టమైన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ నుంచి తరలిపోయిన నేపథ్యంలో అన్ని ఆయుధాలను కూడా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న సైనిక స్థావరాలను వదిలేసి వెళ్ళిపోయింది. ఇక ఇలా అమెరికా సైన్యం వదిలేసి వెళ్లిన ఆయుధాలను క్యాష్ చేసుకోవాలని తాలిబన్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లో ఆర్థిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో అమెరికా సైనికులు వదిలి వెళ్ళిన ఆయుదాలను పాకిస్థాన్లోని తీవ్రవాద సంస్థలకు అమ్మడానికి కూడా సిద్ధమయ్యారు. తాలిబన్లు ఒకవేళ అమెరికా ఆయుధాలు తాలిబన్ల చేతికి వస్తే ఇక ఉగ్రవాదులు మరింత బలంగా మారే అవకాశం ఉంది. ఇది భారత్కు ఎంతో ప్రమాదకరంగా మారబోతుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొనుగోలు చేస్తున్న ఆయుధాలతో ఉగ్ర సంస్థల ముందుగా పాకిస్తాన్లోని దాడి చేసే అవకాశం ఉందని.. ఇదంతా జరగకుండా అడ్డుకుంటామని అంటూ భారత్ చెబుతుండటం గమనార్హం.