ఉత్తరాఖండ్ లో ఎన్నికలకు ముందే బీజేపీకి ఊహించని షాక్...!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ సైతం మంత్రితో భేటీ అయ్యారు. మంత్రి యశ్పాల్ చేరికతో కాంగ్రెస్ బలోపేతం అయ్యే అవకాశం ఉంది. 2007 నుంచి 2014 వరకు ఆయన ఉత్తరఖండ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. ఇదివరకు హరీష్ రావత్ క్యాబినెట్లో మంత్రి పదవీ చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్‌గా విధులు నిర్వహించాడు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన ముక్తేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అతని కుమారుడు సంజీవ్ నైనిటాల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఆ రాష్ట్రం మాజీ సీఎం హరీశ్‌రావత్.. తరుచూ సీఎంలను మారుస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీకీ తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి యశ్‌పాల్‌ను కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించనున్నారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. అందుకే కొద్ది రోజుల నుంచి ఆయన పార్టీ మారుతున్నారని జోరుగా ప్రచారం సాగింది. బీజేపీ నాయకులు ఆయన పార్టీలోనే ఉంటారని పేర్కొన్నారు. వారందరికీ షాక్ ఇచ్చి యశ్పాల్ తన కుమారునితో కలిసి సొంత గూటికి చేరుకున్నాడు. అసెంబ్లీ ఎలక్షన్లకు కొద్ది నెలలకు ముందు ఉత్తరఖండ్ లో బీజేపీకి ఊహించని షాక్ తగిలిందని పలువురు చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో వేచి చూడాలి.