జగన్ కు నారా లోకేష్ లేఖ !

Veldandi Saikiran
అమ‌రావ‌తి : విద్యుత్ సంక్షోభం, విద్యుత్ ఛార్జీ ల పై ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు టీడీపీ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్. విద్యుత్ వినియోగ‌దారుల‌కు భారంగా మారిన పెంచిన‌ చార్జీలను వెంటనే త‌గ్గించాలని లేఖ లో డిమాండ్‌ చేశారు నారా లోకేష్‌.  ట్రూ అప్ చార్జీలు త‌క్షణ‌మే ఉప‌సంహ‌రించుకోవాలని.... కుప్పకూలిన విద్యుత్‌ రంగాన్ని అత్యవ‌స‌రంగా గాడిన పెట్టాలని లేఖ లో వెల్లడించారు నారా లోకేష్‌.  ఆంధ్ర ప్రదేశ్  సీఎం జగన్ ప్రతిప‌క్ష నేత‌గా ఉన్నప్పుడు క‌రెంట్ చార్జీలు పూర్తిగా త‌గ్గించేస్తామ‌ని మాట తప్పారని నిప్పులు చెరిగారు నారా లోకేష్‌.  
ఐదేళ్ల టిడిపి పాల‌న‌లో ఒక్కసారి కూడా చార్జీలు పెంచ‌క‌పోయినా నాడు అస‌త్య ప్రచారాలు చేశారని మండి పడ్డారు నారా లోకేష్‌.  రెండున్నరేళ్ల పాల‌న‌లో ఇప్పటికే 6 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని... మరోసారి ఛార్జీలు పెంచేందుకు సిద్ధం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్‌..  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర  ప్రభుత్వం బ‌కాయిలు చెల్లించేలా చ‌ర్యలు తీసుకుని సంక్షోభంలో ప‌డిన విద్యుత్‌ రంగాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేఖ లో పేర్కన్నారు నారా లోకేష్‌. 
తమ డిమాండ్ల పై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం స్పందించక పోతే మరో ఉద్యమానికి సిద్ధమౌవుతామని హెచ్చరించారు నారా లోకేష్‌. విద్యుత్‌ సంక్షోభ ం పై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేఖ లో పేర్కొన్నారు నారా లోకేష్‌. కాగా.. రెండు రోజుల కిందటే.. విద్యుత్ సంక్షోభం అంశం పై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి  ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి  లేఖ రాసిన సంగ తి మన అందరికీ తెల్సిందే. అయితే.. ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రాసిన లేఖ పై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: